‘JEE Main 2023 రిజిస్ట్రేషన్‌ తేదీలు మేము ఇవ్వలేదు.. అది ఫేక్‌ నోటీస్‌’: ఎన్టీఏ

|

Nov 16, 2022 | 11:35 AM

జాయింగ్‌ ఎట్రన్స్ ఎగ్జామినేషన్‌ (మెయిన్‌) 2023 తొలి విడత పరీక్ష వచ్చే జనవరిలో, తుది విడత ఏప్రిల్‌లో నిర్వహించేందుకు సన్నద్దమవుతున్నట్లు సోషల్‌ మీడియాలో చక్కర్లుకొడుతున్న వార్తలపై నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ..

JEE Main 2023 రిజిస్ట్రేషన్‌ తేదీలు మేము ఇవ్వలేదు.. అది ఫేక్‌ నోటీస్‌: ఎన్టీఏ
JEE Main 2023 fake notification
Follow us on

జాయింగ్‌ ఎట్రన్స్ ఎగ్జామినేషన్‌ (మెయిన్‌) 2023 తొలి విడత పరీక్ష వచ్చే జనవరిలో, తుది విడత ఏప్రిల్‌లో నిర్వహించేందుకు సన్నద్దమవుతున్నట్లు సోషల్‌ మీడియాలో చక్కర్లుకొడుతున్న వార్తలపై నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ మంగళవాంర (నవంబర్‌ 15) స్పష్టత నిచ్చింది. జేఈఈ మెయిన్‌ 2023 పరీక్షకు సంబంధించి తాము ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదని వెల్లడించింది. దీనికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్‌ అవుతున్న నోటీస్‌ ఫేక్‌ అని ఎన్‌టీఏ డీజీ వినీత్‌ జోషీ స్పష్టంచేశారు. విద్యార్ధులు అప్‌డేట్‌ల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చెక్‌ చేయాలని, ఇటువంటి నకిళీ వార్తలను నమ్మిమోసపోవద్దని ఈ సందర్భంగా సూచించారు.

సదరు ఫేక్‌ నోటీస్‌ ప్రకారం.. జేఈఈ మెయిన్‌ తొలి విడత రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నవంబర్‌లో ప్రారంభమవుతుందని, డిసెంబర్‌ 31 నాటికి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొంది. ఇక దీనికి సంబంధించిన పరీక్ష జనవరి 18 నుంచి 23 వరకు నిర్వహిస్తుందని, సెషన్‌-2 పరీక్ష ఏప్రిల్‌ 4 నుంచి 9 వరకు జరగనుందని ఎన్‌టీఏ పేరుతో సామాజిక మాధ్యమాల్లో నిన్న చక్కర్లు కొడుతున్న నకిళీ ప్రకటన సారాంసం. దీనిపై స్పందించిన అధికారులు తాము ఎటువంటి తేదీలను నిర్ణయించలేదని స్పష్టంచేశారు.

కాగా ఈ ఏడాది కూడా జేఈఈ 2022 రెండు సెషన్లలో జూన్‌ 20 నుంచి 29 వరకు తొలి దశ, జులై 21 నుంచి 30 వరకు రెండు దశల్లో పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. ఏన్టీఏ ప్రతీయేట జేఈఈ మెయిన పరీక్ష నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. దీనిలో అర్హత సాధించిన వారు జేఈఈ అడ్వాన్స్‌కు హాజరుఅవుతారు. దీనిలో సాధించిన ర్యాంకు ఆధారంగా దేశంలో ప్రసిద్ధ ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఈఎస్టీ, ఐఐఐటీ ఇతర సంస్థల్లో బీటెక్‌, బీఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.