
దేశవ్యాప్తంగా మార్చి నెలంతా పలు పోటీ పరీక్షలు, అకడమిక్ పరీక్షలు జరగనున్నాయి. దీంతో విద్యార్ధులు, యువత పలురకాల పరీక్షలతో పుస్తకాలతో కుస్తీపడుతున్నారు. కాగా ఇటీవల కేంద్ర, రాష్ట్ర నియామక సంస్థలు, పలు విద్యా సంస్థలు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు, ప్రవేశాలకు నోటిఫికేషన్‌లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆయా పరీక్షళకు అర్హులైన అభ్యర్థులు ఇప్పటికే దరఖాస్తు చేసుకుని పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు కూడా. ఈ క్రమంలో పలు ఉద్యోగ, ప్రవేశ పరీక్షల ప్రకటనలకు సంబంధించి పరీక్షలు మార్చి నెలలో జరగనున్నాయి.
మార్చి నెలలో జరగనున్న ముఖ్యమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల తేదీల వివరాలు ఇవే..
తెలంగాణ సాంకేతిక, ఇంటర్ విద్య విభాగాల్లో లైబ్రేరియన్ పోస్టులకు మార్చి 5వ తేదీన ధ్రువీకరణ పత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ శుక్రవారం (మార్చి 1) తెలిపింది. మార్చి 5న ఉదయం 10.30 గంటల నుంచి టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఉంటుందని పేర్కొంది. ఇప్పటికే 1:2 నిష్పత్తిలో ఎంపికైన అభ్యర్థుల జాబితాను కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరిశీలనకు వచ్చే జాబితాలో ఉన్న అభ్యర్ధులు అందరూ చెక్‌లిస్టులోని పత్రాలు తీసుకురావాలని సూచించింది. ధ్రువీకరణ పత్రాల పరిశీలనలో ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలు సమర్పించకుంటే తదుపరి సమయం ఇవ్వబోమని కమిషన్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. షెడ్యూలు ప్రకారం పరిశీలనకు తప్పనిసరిగా హాజరుకావాలని, గైర్హాజరైన అభ్యర్ధుల అభ్యర్థిత్వాన్ని నియామక ప్రక్రియలో పరిశీలించబోమని టీఎస్పీయస్సీ వెల్లడించింది. లైబ్రేరియన్ పోస్టుల ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.