AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Inter Board: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఒక్క నిమిషం నిబంధన సడలించిన ఇంటర్ బోర్డు

విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా చేరుకుంటే ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్‌ను అనుమతించాలని ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారులు ఆయా జిల్లాల అధికారులకు, సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్‌లకు సూచించారు. అయితే గతంలో ఒక్క నిమిషం నిబంధన ఉండగా, దానిని సడలించింది ఇంటర్ బోర్డు. ఉదయం 8.45 కల్లా ఎగ్జామ్ సెంటర్స్ కు చేరుకోవాలని సూచించిన ఇంటర్‌ బోర్డు.. ఐదు నిమిషాల పాటు ఆలస్యమైనా అనుమతిస్తామని ..

TS Inter Board: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఒక్క నిమిషం నిబంధన సడలించిన ఇంటర్ బోర్డు
Inter Exam
Subhash Goud
|

Updated on: Mar 01, 2024 | 8:46 PM

Share

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షలకు విద్యార్థులు ఉదయం 8:45 గంటలకు తమ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 9 గంటల తర్వాత ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ కు అనుమతి చేస్తామన్నారు. నిర్దిష్ట కారణాల వల్ల విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా చేరుకుంటే ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్‌ను అనుమతించాలని ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారులు ఆయా జిల్లాల అధికారులకు, సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్‌లకు సూచించారు.

అయితే గతంలో ఒక్క నిమిషం నిబంధన ఉండగా, దానిని సడలించింది ఇంటర్ బోర్డు. ఉదయం 8.45 కల్లా ఎగ్జామ్ సెంటర్స్ కు చేరుకోవాలని సూచించిన ఇంటర్‌ బోర్డు.. ఐదు నిమిషాల పాటు ఆలస్యమైనా అనుమతిస్తామని తెలిపింది. కాగా, ఇటీవల ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యతో సడలింపు ఇచ్చింది. ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 29వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. అయితే ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి లేని కారణంగా కొంత మంది విద్యార్థులు రాలేకపోయారు. ఓ విద్యార్థి పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా రావడంతో అధికారులు పరీక్ష రాసేందుకు ఆ విద్యార్థికి అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై స్పందించిన తెలంగాణ ఇంటర్‌ బోర్డ్‌ ఒక్క నిమిషం నిబంధనను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!