ESIC Recruitment: ఈఎస్‌ఐసీ, తెలంగాణ రీజియన్‌లో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

|

Jan 02, 2022 | 8:39 AM

ESIC Recruitment: ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకు చెందిన ఈ సంస్థలో..

ESIC Recruitment: ఈఎస్‌ఐసీ, తెలంగాణ రీజియన్‌లో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
Follow us on

ESIC Recruitment: ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకు చెందిన ఈ సంస్థలో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 72 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌ (యూడీసీ) – 25, స్టెనోగ్రాఫర్‌ (04), మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌ (43) పోస్టులు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఎంటీఎస్‌ పోస్టులకు పదో తరగతి/ తత్సమాన, స్టెనోగ్రాఫర్‌ పోస్టులకి ఇంటర్మీడియట్‌, అప్పర్‌ డివిజణ్‌ క్లర్క్‌ పోస్టులకు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

* అభ్యర్థుల వయసు యూడీసీ, స్టెనో పోస్టులకు 18 నుంచి 27 ఏళ్లు, ఎంటీఎస్‌ పోస్టులకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

* ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ. 250, ఇతరులు రూ. 500 ఫీజుగా చెల్లించాలి.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ 15-01-2022న ప్రారంభమవుతుండగా, చివరి తేదీగా 15-02-2022 నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Worshiping Trees: ఈ చెట్లలో దేవతలు నివసిస్తారట.. అందుకే పూజిస్తారట..? ఆ చెట్లు ఏంటంటే..

Vaccination: టీకా తీసుకున్నాక పిల్లల్లో ఈ సమస్యలుంటే భయపడవద్దు.. వైద్యుడి సలహా తీసుకోండి..

హిందువులు కాని వారికి అనుమతి లేని ఆలయం ఎక్కడో తెలుసా..