ESI Recruitment: ఈఎస్ఐలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.
ఈఎస్ఐ ఆధ్వర్యంలోని పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రిసెర్చ్(పీజీఐఎంఎస్‌ఆర్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. న్యూఢిల్లీలో ఉన్న ఈ సంస్థలో సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?
ఈఎస్ఐ ఆధ్వర్యంలోని పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రిసెర్చ్(పీజీఐఎంఎస్‌ఆర్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. న్యూఢిల్లీలో ఉన్న ఈ సంస్థలో సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 98 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* సర్జికల్ ఆంకాలజీ, సర్జరీ, పిడియాట్రిక్స్, క్యాజువాలిటీ, ఈఎన్‌టీ, నెఫ్రాలజీ, కార్డియాలజీ, బయోకెమిస్ట్రీ, రేడియాలజీ, పాథాలజీ, ప్లాస్టిక్ సర్జరీ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్/ పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 45 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ. 300 చెల్లించాల్సి ఉంటుంది.
* ఇంటర్వ్యూలను 5వ ఫ్లోర్, డీన్ ౠఫీస్, ఈఎస్‌ఐ-పీజీఐఎమ్‌ఎస్‌ఆర్, బసైంద్రపూర్, న్యూఢిల్లీ-15 అడ్రస్‌లో నిర్వహిస్తారు.
* ఇంటర్వ్యూలను మే 10, 11 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహిస్తారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..