ESIC Recruitment: ఈఎస్‌ఐ హాస్పిటల్‌లో ఉద్యోగాలు.. వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక..

|

Feb 01, 2022 | 2:56 PM

ESIC Recruitment: ఈఎస్‌ఐ హాస్పిటల్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకి చెందిన ఈ సంస్థ న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఈఎస్‌ఐ హాస్పిటల్‌లో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను..

ESIC Recruitment: ఈఎస్‌ఐ హాస్పిటల్‌లో ఉద్యోగాలు.. వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక..
Follow us on

ESIC Recruitment: ఈఎస్‌ఐ హాస్పిటల్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకి చెందిన ఈ సంస్థ న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఈఎస్‌ఐ హాస్పిటల్‌లో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు. ఏయో విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం…

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషనలో భాగంగా మొత్తం 26 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో సీనియర్‌ రెసిడెంట్లు (15), జీడీఎంఓ (08), జూనియర్‌ స్పెషలిస్ట్‌ (03) ఖాళీలు ఉన్నాయి.

* అనెస్తీషియా, సర్జరీ, పీడియాట్రిక్స్‌, జనరల్‌ మెడిసిన్‌, బయోకెమిస్ట్రీ, పాథాలజీ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఎంబీబీఎస్‌తో పాటు సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్‌ పీజీ/ డీఎస్‌బీ/ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.

* వీటితో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

* అభ్యర్థుల వయసు 45 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా వాక్‌ ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది.

* ఇంటర్వ్యూలను మెడికల్‌ సూపరింటెండెంట్‌, ఇందిరాగాంధీ, ఈఎస్‌ఐ హాస్పిటల్‌, ఢిల్లీ అడ్రస్‌లో నిర్వహిస్తారు. అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లతో హాజరు కావాలి.

* వాక్‌ ఇంటర్వ్యూను 11-02-2022న నిర్వహించనున్నారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Budget 2022: కేంద్రం నూతన సంస్కరణ.. దేశంలో ఎక్కడి నుంచైనా భూ రిజిస్ట్రేషన్‌..!

Viral News: కూతురితో కలిసి ఎడారిలో సేద తీరుతున్న ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టండి..

Stock Market Update: బడ్జెట్ డే బూస్టర్.. పైపైకి దూసుకుపోతున్న సూచీలు