భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్.. ఒప్పంద ప్రాతిపదికన 17 అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, అనెస్తీషియా, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, హ్యూమన్ అనాటమీ, ఆరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ, కన్జర్వీటివ్ డెంటిస్ట్రీ తదితర తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎమ్‌డీ/ఎమ్‌ఎస్/డీఎన్బీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో టీచింగ్ అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 69 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలు కలిగిన అభ్యర్ధులు డిసెంబర్ 2, 2022వ తేదీలోపు ఆఫ్‌లైన్ విధానంలో కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. జనరల్ అభ్యర్ధులు రూ.225లు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్వీస్‌మెన్/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఎంపికైన వారికి నెలకు రూ.1,30,797ల నుంచి రూ.1,52,241ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
The Dean, ESIC Dental College and Hospital, Sector-15, Rohini, New delhi-110089.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.