ESI Sanagareddy Jobs: రాత పరీక్షలేకుండా సంగారెడ్డి ఈఎస్ఐలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..

|

Apr 09, 2023 | 11:36 AM

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లోని ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్.. ఒప్పంద ప్రాతిపదికన సంగారెడ్డి జిల్లాలోని ఈఎస్‌ఐ హాస్పిటల్/ ఈఎస్‌ఐ డిస్పెన్సరీల్లో 16 సివిల్ అసిస్టెంట్ సర్జన్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్, ఫార్మాసిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..

ESI Sanagareddy Jobs: రాత పరీక్షలేకుండా సంగారెడ్డి ఈఎస్ఐలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..
ESI Sanagareddy
Follow us on

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లోని ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్.. ఒప్పంద ప్రాతిపదికన సంగారెడ్డి జిల్లాలోని ఈఎస్‌ఐ హాస్పిటల్/ ఈఎస్‌ఐ డిస్పెన్సరీల్లో 16 సివిల్ అసిస్టెంట్ సర్జన్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్, ఫార్మాసిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి ఎంబీబీఎస్‌/బీడీఎస్, ఫార్మసీలో డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మార్చి 19, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 44 ఏళ్లకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఈ అర్హతలున్నవారు ఆఫ్‌లైన్‌ విధానంలో ఏప్రిల్‌ 13, 2023వ తేదీలోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది.  ఇంటర్వ్యూ, అనుభవం ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.31,040ల నుంచి రూ.58,850ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.

అడ్రస్..

The Joint Director (Medical), Insurance Medical Services, Hyderabad, 5th floor,
Hostel Building, ESI Hospital Sanathnagar Located at Nacharam, Hyderabad- 500076.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇతర పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.