EMRS Recruitment 2023: ఏకలవ్య మోడల్‌ పాఠశాలల్లో 6,329 టీజీటీ, హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు..ఈ అర్హతలు అవసరం

|

Jul 21, 2023 | 1:51 PM

దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల (ఈఎంఆర్‌ఎస్‌)లో డైరెక్ట్ ప్రాతిపదికన 6,329 టీజీటీ, హాస్టల్ వార్డెన్ పోస్టుల భర్తీకి కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలోని నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌ (నెస్ట్స్‌) దరఖాస్తులు కోరుతూ..

EMRS Recruitment 2023: ఏకలవ్య మోడల్‌ పాఠశాలల్లో 6,329 టీజీటీ, హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు..ఈ అర్హతలు అవసరం
Eklavya Model Residential School
Follow us on

న్యూఢిల్లీ, జులై 21: దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల (ఈఎంఆర్‌ఎస్‌)లో డైరెక్ట్ ప్రాతిపదికన 6,329 టీజీటీ, హాస్టల్ వార్డెన్ పోస్టుల భర్తీకి కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలోని నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌ (నెస్ట్స్‌) దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం పోస్టుల్లో 5,660 టీజీటీ, 669 హాస్టల్ వార్డెన్ పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో ఆగస్టు 18వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

టీజీటీ సబ్జెక్టులు..

హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్‌, సోషల్‌ స్టడీస్‌, సైన్స్, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, తెలుగు, ఉర్దూ, మిజో, సంస్కృతం, సంతాలి, మ్యూజిక్‌, ఆర్ట్‌, పీటీటీ (మేల్‌), పీఈటీ (ఫిమేల్‌), లైబ్రేరియన్.

ఏయే అర్హతలుండాలంటే..

టీజీటీ పోస్టులకు సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈడీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సీటెట్‌ ఉత్తీర్ణులై ఉండాలి. టీజీటీ పీఈటీ పోస్టులకు డిగ్రీ, బీపీఈడీలో అర్హత ఉండాలి. టీజీటీ లైబ్రేరియన్‌ పోస్టులకు డిగ్రీ, బీఎల్‌ఐఎస్సీ ఉత్తీర్ణులైనట్లు సర్టిఫికెట్లు ఉండాలి. దరఖాస్తుదారుల వయసు ఆగస్టు 18, 2023 నాటికి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. రాత పరీక్ష (ఈఎంఆర్‌ఎస్‌ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్-2023), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి టీజీటీ ఉద్యోగాలకు నెలకు రూ.44,900 నుంచి రూ.14,2400 వరకు, హాస్టల్ వార్డెన్‌ పోస్టులకు నెలకు రూ.29,200 నుంచి రూ.92,300 వరకు జీతంగా చెల్లిస్తారు.

ఇవి కూడా చదవండి

ఆన్‌లైన్‌లో ఆగస్టు 18, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. టీజీటీ పోస్టులకు రూ.1500, హాస్టల్ వార్డెన్ పోస్టులకు రూ.1000 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

పోస్టుల వివరాలు..

  • ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ) పోస్టులు: 5,660
  • హాస్టల్ వార్డెన్ (పురుషులు) పోస్టులు: 335
  • హాస్టల్ వార్డెన్ (మహిళలు) పోస్టులు: 334

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.