Jobs: ఫ్రెషర్స్‌ని ఎక్కువగా రిక్రూట్‌ చేసుకుంటున్న ఆ సంస్థలు.. వచ్చేవన్ని ఇక మంచి రోజులేనా.?

దేశంలో ఉద్యోగాల రిక్రూట్‌మెంట్‌ పెరుగుతోంది. ముఖ్యంగా ప్రముఖ స్టార్టప్‌ కంపెనీలు, ఈ కామర్స్‌ సంస్థలు పెద్ద ఎత్తున క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే భారీ వేతనంతో ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటున్నాయి..

Jobs: ఫ్రెషర్స్‌ని ఎక్కువగా రిక్రూట్‌ చేసుకుంటున్న ఆ సంస్థలు.. వచ్చేవన్ని ఇక మంచి రోజులేనా.?
Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 04, 2024 | 4:53 PM

దేశవ్యాప్తంగా ఆ మాకొస్తే ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల నియామకం భారీగా తగ్గిందని గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పెద్ద పెద్ద కంపెనీలు ఉద్యోగులను తొలగించడం, ఇక కొత్తగా రిక్రూట్‌మెంట్స్‌ను కూడా భారీగా తగ్గించాయి. దీంతో రానున్నది అంతా కష్ట కాలమే అని భావించారు.

కానీ తాజాగా పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. కంపెనీలు ఉద్యోగులను నియమించుకోవడం ప్రారంభించాయి. ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులను రిక్రూట్‌ చేసుకునే సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా స్టార్టప్‌, ఈకామర్స్‌ సంస్థలు పెద్ద ఎత్తున ఇంజనీర్‌ గ్రాడ్యుయేట్స్‌ను నియమించుకుంటున్నాయి. అది కూడా మంచి ప్యాకేజీతో ఉద్యోగాలను అందిస్తున్నాయి.

జొమాటో, ఫ్లిప్‌కార్ట్‌, ఓలా, మీషో, మింత్రా, ఫోన్‌పే, గేమ్స్క్రాఫ్‌, హైల్యాబ్స్‌, క్విక్‌ెల్‌, గ్రో, విన్‌జో, కార్స్‌24, బ్యాటరీ స్మార్ట్‌, నో బ్రోకర్‌ వంటి కంపెనీలు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ౠప్‌ టెక్నాలజీ, బిట్స్‌ పిలానీ, ట్రిపుల్‌ ఐటీలలో విద్యార్థులను రిక్రూట్‌ చేసుకున్నాయి. సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌, డేటా సైన్స్‌, ప్రొడక్ట్‌ అనలిటిక్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో పాటు మిషన లెర్నింగ్ వంటి విభాగాల్లో ఉద్యోగులను తీసుకున్నారు.

క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో రిక్రూట్ అయిన విద్యార్థులకు కనీస వేతనంగా ఏడాదికి రూ. 8 నుంచి రూ. 12 లక్షలు అందిస్తారు. కంపెనీలు గరిష్టంగా కోటి రూపాయల వార్షిక జీతం అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలో ఆదివారం నుంచి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ ప్రారంభం కాగా.. క్విక్‌సెల్‌, ఇండస్‌ ఇన్‌సైట్స్‌ కంపెనీలు ఏటా రూ. 16 నుంచి రూ. 18 లక్షల ప్యాకేజీతో ఉద్యోగులను రిక్రూట్‌ చేసకు్నాయి. అలాగే కార్స్‌ 24 ఏకంగా రూ 26 లక్షలు, మింత్రా రూ. 30 లక్షల వేతనంతో ఉద్యోగులను ఎంపిక చేస్తున్నాయి. గతేడాది క్యాంపెస్‌ ప్లేస్‌మెంట్స్‌ ఆశించిన స్థాయిలో జరగలేవనే విషయం తెలిసిందే.. అయితే ఈసారి పరిస్థితులు మెరుగుపడుతున్నట్లు కనపిస్తోంది.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..