Layoffs: ఉద్యోగులను బెంబేలెత్తిస్తోన్న పింక్‌ స్లిప్స్‌.. ఎంప్లాయిస్‌ను ఇంటికి సాగనంపుతోన్న మరో కంపెనీ..

|

Aug 27, 2022 | 3:56 PM

Layoffs: ప్రస్తుతం మాంద్యం తాలుకు భయాలు వెంటాడుతున్నాయి. అమెరికాలో ఇప్పటికే మాంద్యం ప్రభావం మొదలైందని ఆర్థిక నిపుణులు చెబుతోన్న తరుణంలో చాలా వరకు కంపెనీలు ఉద్యోగులను తొలగించే ప్రక్రియను మొదలు పెట్టాయి. ఇప్పటికే యాపిల్, అమెజాన్‌,...

Layoffs: ఉద్యోగులను బెంబేలెత్తిస్తోన్న పింక్‌ స్లిప్స్‌.. ఎంప్లాయిస్‌ను ఇంటికి సాగనంపుతోన్న మరో కంపెనీ..
Job Cuts
Follow us on

Layoffs: ప్రస్తుతం మాంద్యం తాలుకు భయాలు వెంటాడుతున్నాయి. అమెరికాలో ఇప్పటికే మాంద్యం ప్రభావం మొదలైందని ఆర్థిక నిపుణులు చెబుతోన్న తరుణంలో చాలా వరకు కంపెనీలు ఉద్యోగులను తొలగించే ప్రక్రియను మొదలు పెట్టాయి. ఇప్పటికే యాపిల్, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి కొన్ని బడా టెక్‌ దిగ్గజాలు ఉద్యోగులకు పింక్‌ స్లిప్‌లిచ్చి ఇంటికి సాగనంపాయి. అయితే ఇప్పటి వరకు మల్టీ నేషనల్‌ కంపెనీలకు పరిమితమైన ఈ ట్రెండ్ తాజాగా దేశీయ కంపెనీలోనూ కనిపించింది.

తాజాగా ప్రముఖ ఆన్‌లైన్‌ షాపింగ్ సంస్థ మీషో ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌లో దుస్తులతో వ్యాపారాన్ని మొదలు పెట్టిన మీషో ఆ తర్వాత గ్రాసరీని కూడా అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా నాగ్‌పూర్, మైసూర్‌ను మినహాయించి మిగతా అన్ని ప్రాంతాల్లో గ్రాసరీ బిజినెస్‌ సూపర్‌స్టోర్‌ను ఆపేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం కారణంగానే మీషో 300 మంది ఉద్యోగులను తొలగిస్తోంది.

ఇదిలా ఉంటే మీషో ఉద్యోగులను తొలగించడం ఇదే తొలిసారి కాదు గతంలో కరోనా ఫస్ట్‌ వేవ్‌ సమయంలోనూ 200 మంది ఉద్యోగులను తొలగించింది. ఆదాయం తగ్గడం, ఖర్చులు పెరగడం వల్ల మీషో నష్టాల్లోకి వెళ్లిందని ఈ కారణంగానే ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..