Education: ఆంధ్రా యూనివర్సిటీలో డ్యూయల్ డిగ్రీ కోర్సులు.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే..

విశాఖపట్టణంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో డబుల్ డిగ్రీ ఇంజినీరింగ్ కోర్సులకు ప్రకటన విడుదలైంది. ఆంధ్రా యూనివర్సిటీ, స్వీడన్ కు చెందిన బ్లీకింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు సంయుక్తంగా

Education: ఆంధ్రా యూనివర్సిటీలో డ్యూయల్ డిగ్రీ కోర్సులు.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే..
Andhra University
Follow us
Amarnadh Daneti

|

Updated on: Aug 29, 2022 | 10:05 AM

Education News: విశాఖపట్టణంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో డబుల్ డిగ్రీ ఇంజినీరింగ్ కోర్సులకు ప్రకటన విడుదలైంది. ఆంధ్రా యూనివర్సిటీ, స్వీడన్ కు చెందిన బ్లీకింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు సంయుక్తంగా ఈకోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. రెండు సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న డబుల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈకోర్సు కాలపరిమితి నాలుగు సంవత్సరాలు. మొదటి మూడేళ్లు ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో చదవాల్సి ఉంటుంది. చివరి ఏడాది బ్లీకింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విద్యను అభ్యసించాల్సి ఉంటుంది. డ్యూయల్ డిగ్రీ కోర్సులో ప్రవేశం పొందిన విద్యార్థులు ప్రతి ఏడాది రెండు సెమిస్టర్లను పూర్తి చేయాల్సి ఉంటుంది. బ్లీకింగ్ యూనివర్సిటీలో తప్పనిసరిగా అండర్ గ్రాడ్యుయేట్ ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈడ్యూయల్ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు ఆంధ్రా యూనివర్సిటీ నుంచి బీటెక్ డిగ్రీ, బ్లీకింగ్ యూనివర్సిటీ నుంచి బిఎస్ డిగ్రీలు అందుతాయి. కోర్సు పూర్తి చేసిన వారు ఆంధ్రా యూనివర్సిటీ లేదా బ్లీకింగ్ యూనివర్సిటీలు ఆఫర్ చేసే పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.

డ్యూయల్ డిగ్రీలో ఆఫర్ చేస్తున్న కోర్సుల వివరాలు.. మెకానికల్ ఇంజినీరింగ్

ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్

ఇవి కూడా చదవండి

కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కోర్సులు ఉన్నాయి. అయితే ఈడ్యూయల్ డిగ్రీలో ఒక్కో కోర్సులో ఐదు సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని ఆంధ్రా యూనివర్సిటీ అధికారులు జారీచేసిన నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

డ్యూయల్ డిగ్రీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన విద్యార్హత కలిగి ఎంపిసి గ్రూపునకు చెందిన సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. 2022 జేఈఈ మెయిన్స్ లేదా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నిర్వహించిన ఎంసెట్ ఎంట్రన్స్ లేదా ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశపరీక్షల్లో ఏదో ఒక దానిలో తప్పనిసరిగా అర్హత సాధించి ఉండాలి. ఇంగ్లీష్ మినహా మిగతా మాద్యమాల్లో ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు బ్లీకింగ్ యూనివర్సిటీలో ప్రవేశం నాటికి ఐఈఎల్ టీఎస్, టోఫెల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఆంధ్రా యూనివర్సిటీ, బ్లీకింగ్ యూనివర్సిటీ సంయుక్తంగా అందిస్తున్న ఈ డ్యూయల్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేయడానికి సెప్టెంబర్ 12తో గడువు ముగుస్తుంది. మరిన్ని వివరాల కోసం www.andhrauniversity.edu.in వెబ్ సైట్ ను సందర్శించవచ్చు. లేదా ఇక్కడ క్లిక్ చేసి నేరుగా వెబ్ సైట్ పేజిని సందర్శించవచ్చు.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం చూడండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే