DTC Recruitment: ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారంటే..

| Edited By: Ravi Kiran

Apr 18, 2022 | 9:50 AM

DTC Recruitment: ఢిల్లీ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (DTC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం 357 పోస్టులను కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

DTC Recruitment: ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారంటే..
Jobs
Follow us on

DTC Recruitment: ఢిల్లీ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (DTC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం 357 పోస్టులను కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 357 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌ (112), అసిస్టెంట్‌ ఫిట్టర్‌ (175), అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్‌ (70) ఖాళీలు ఉన్నాయి. రిపేర్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను టెక్నికల్‌ క్వాలిఫికేషన్‌ మెరిటట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా రూ. 17,693 నుంచి రూ. 35,400 వరకు చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 18-04-2022 నుంచి మొదలవుతుండగా, 04-05-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Keerthi Suresh: స్పెషల్ డిజైన్‌ చీరలో మెరిసిపోతోన్న కీర్తీ సురేష్‌.. వైరలవుతున్న లేటెస్ట్‌ ఫొటోలు..

Sarkaru Vaari Paata: క్లైమాక్స్‌లో మహేష్ సర్కారు వారి పాట.. ప్రమోషన్స్ ప్లాన్ చేసుకుంటున్న మేకర్స్..

Delhi Violence: ఢిల్లీ అల్లర్ల కేసులో కీలక నిందితుడు అరెస్ట్.. పోలీసులపై కాల్పులు జరిపిన అస్లాం..