AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Knowledge: తెలంగాణలో పెట్టుబడులు పెట్టనున్న బాష్ కంపెనీ గురించి మీకు తెలుసా?

జర్మన్‌ బాష్‌ కంపెనీ ఎప్పుడు స్థాపించారు? ఎన్ని దేశాల్లో తమ కంపెనీలను స్థాపించాయి? వంటి ఆసక్తికర విషయాలు..

Knowledge: తెలంగాణలో పెట్టుబడులు పెట్టనున్న బాష్ కంపెనీ గురించి మీకు తెలుసా?
Bosch
Srilakshmi C
|

Updated on: Feb 09, 2022 | 9:44 PM

Share

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌కు అరుదైన అవకాశం దక్కింది. ప్రఖ్యాత జర్మన్ మల్టీ నేషనల్ కంపెనీ (German MNC) బాష్ హైదరాబాద్‌ (Hyderabad)నగరంలో బాష్ (Bosch) గ్లోబల్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్, ఆర్ అండ్ డి ఏర్పాటు చేయడానికి ఎంపిక చేసుకుంది. ఈ విషయాన్ని పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు మంగళవారం ట్విట్టర్‌లో స్వయంగా తెలియజేసిన సంగతి తెలిసిందే! ఐతే జర్మన్‌ బాష్‌ కంపెనీ ఎప్పుడు స్థాపించారు? ఎన్ని దేశాల్లో తమ కంపెనీలను స్థాపించాయి? వంటి ఆసక్తికర విషయాలు మీకోసం..

బాష్‌ కంపెనీని 136 ఏళ్ల క్రితం అంటే 1886లో జర్మనీలోని జర్లింగన్‌ కేంద్రంగా రాబర్ట్‌ బాష్‌ స్థాపించాడు. అతని పేరు మీదనే ఈ కంపెనీ ఏర్పటయింది. తర్వాత 80 దేశాలకు విస్తరించింది. నిజానికి దీని మొదటి కార్మాగారం స్టట్‌గార్ట్‌లో ప్రారంభించింది. ప్రస్తుతం 4 లక్షల మంది ఉద్యోగులు బాష్‌లో పనిచేస్తున్నారు. భారత్‌లో తమ కార్యకలాపాల విస్తరణలో భాగంగా తెలంగాణలో తమ పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు సంస్థ సాఫ్ట్‌వేర్‌ సాంకేతిక ఉపాధ్యక్షుడు కిరణ్‌ సుందర రామన్‌ తెలిపారు.

జర్మనీకి చెందిన ప్రసిద్ధ పారిశ్రామిక, వాహన, ఇంజినీరింగ్‌ సాంకేతిక గృహోపకరణాల సంస్థ బాష్‌ హైదరాబాద్‌లో గ్లోబల్‌ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీస్‌ సంస్థను, పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. వీటి ద్వారా మూడు వేల మందికి ఉపాధి కల్పించనున్నట్లు కిరణ్‌ సుందర రామన్, ఇతర ప్రతినిధులు ఫిబ్రవరి 8న ప్రగతిభవన్‌లో మంత్రి కేటాఆర్‌తో భేటీ అయ్యారు. జర్మనీ, బెంగళూరు, కోల్‌కతాల నుంచి సంస్థ ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రితో మాట్లాడారు. ఈ మేరకు తమ నిర్ణయాన్ని వెల్లడించారు. గ్లోబల్ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీస్‌ సంస్థను, పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించడంపై త్వరలోనే అధికారిక కార్యక్రమంలో వెల్లడిస్తామని తెలిపారు. ఇక మంత్రి కేటీఆర్‌ ఈ సమావేశంలో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో సంస్థను ఏర్పాటు చేయడానికి బాష్‌ మంచి నిర్ణయం తీసుకుందని అన్నారు. వందేళ్ల క్రితం బాష్‌ ఇదే రోజు కోల్‌కతా కేంద్రంగా భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించింది. ఇదే రోజు తెలంగాణలో తమ కేంద్రం ఏర్పాటు ప్రకటన చేయడంపై కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అని అన్నారు. తాజా ప్రతిపాదనతో దాదాపు 3000 మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. జర్మన్ ఎమ్‌ఎన్‌సీ కంపెనీ అయిన మొబిలిటీ, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ అండ్‌ హోమ్‌ అప్లియాన్సెస్‌లో ప్రపంచ అగ్రగామిగా పేరుగాంచింది.

Also Read:

Viral News: ఈ జంతువు కళ్లు పుర్రె మధ్యలో.. బాబోయ్‌ ఇది నిజంగా మేకేనా..?