Career Guidance: రెజ్యూమ్‌, సీవీలకు మధ్య ఉన్న తేడా ఏంటి.? వేటిలో ఎలాంటి వివరాలు ఇవ్వాలి.. పూర్తి వివరాలు..

|

Dec 31, 2021 | 10:49 AM

Career Guidance: విద్య పూర్తయి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసే వారికి ఒక మంచి రెజ్యూమ్‌ను ప్రిపేర్‌ చేసుకోమని సలహా ఇస్తుంటారు. ఉద్యోగాల నియామకంలో రెజ్యూమేది కీలకపాత్ర అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..

Career Guidance: రెజ్యూమ్‌, సీవీలకు మధ్య ఉన్న తేడా ఏంటి.? వేటిలో ఎలాంటి వివరాలు ఇవ్వాలి.. పూర్తి వివరాలు..
Follow us on

Career Guidance: విద్య పూర్తయి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసే వారికి ఒక మంచి రెజ్యూమ్‌ను ప్రిపేర్‌ చేసుకోమని సలహా ఇస్తుంటారు. ఉద్యోగాల నియామకంలో రెజ్యూమేది కీలకపాత్ర అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెజ్యూమే ఆధారంగానే రిక్రూటర్స్‌ అభ్యర్థిపై ఓ అంచనాలకు వస్తారు. అయితే రెజ్యూమ్‌తో పాటు సీవీ, బయోడేటాల పేర్లు కూడా మనకు వినిపిస్తుంటాయి. ఇంతకీ వీటి మూడింటి మధ్య ఉన్న తేడాలు ఏంటో తెలుసా.?

రెజ్యూమ్‌లో ఏముంటాయంటే..

రెజ్యూమ్‌ అనేది ముఖ్యంగా ఫ్రెషర్స్‌ కోసం కేటాయించింది. ఇందులో ప్రముఖంగా అభ్యర్థి విద్యార్హతలు, నైపుణ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటుంది. ఇందులో ప్రొఫైల్‌ గురించి పెద్దగా సమాచారం ఉండదు. రెజ్యూమ్‌లో తండ్రిపేరు, జాతీయత, లింగం, అభిరుచుల గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. సాధారణంగా రెజ్యూమ్‌ కేవలం ఒకటి లేదా రెండు పేజీలు మాత్రమే ఉంటాయి.

అసలేంటీ సీవీ..

సీవీ అంటే కర్రిక్యులం విటే. ఇది లాటిన్‌ భాషకు చెందిన పదం. తెలుగులో దీనికి అర్థం జీవిత గమనం. అంటే మీ కెరీర్‌ జీవితంలో ముఖ్య ఘట్టాలు ఇందులో ఉంటాయని అర్థం. రెజ్యూమ్‌లో పేర్కొ్న్న సమాచారం కాకుండా, ప్రత్యేక నైపుణ్యాలు, గత పని అనుభవంతో పాటు అనుభవనానికి సంబంధించిన వివరాలు ఇందులో ఉంటాయి.

బయోడేటా అంటే..

ఇక బయోడేటా విషయానికొస్తే ఇది 1980, 90ల సమయంలో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉండేది. బయోడేటాలో సాధారణంగా అభ్యర్థికి సంబంధించిన ప్రాథమిక సమాచారం ఉంటుంది. ఇందులో అభ్యర్థి పుట్టిన తేదీ, మతం, లింగం, అడ్రస్‌, మ్యారిటల్‌ స్టేటస్‌ వంటి సమాచారం ఉంటుంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం వీడియో రెజ్యూమ్‌ ట్రెండింగ్‌లో నడుస్తోంది. చాలా కంపెనీలు అభ్యర్థుల కమ్యూనికేషన్‌ నైపుణ్యాలను పరీక్షించే క్రమంలో వీడియో రెజ్యూమ్‌ను కోరుతున్నాయి. 1 నుంచి 2 నిమిషాల నిడివి ఉండే ఈ వీడియోలో అభ్యర్థి తన గురించి, తన నైపుణ్యాల గురించి సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది.

Also Read: c VIGIL: ఈ విషయం మీకు తెలుసా? ఎన్నికల్లో అక్రమాలకు చెక్ చెప్పే యాప్ ఒకటి ఉంది..దీని గురించి తెలుసుకోండి!

Visakhapatnam: అక్రమ నిర్మాణాలపై ఎందుకింత అలక్ష్యం?.. వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వండి.. విశాఖ కలెక్టర్‌ను ఆదేశించిన హైకోర్టు..

పాత పాటనే కొత్తగా పాడుతున్న చైనా..అరుణాచల్‌లోని కొన్ని ప్రాంతాల పేర్లు మారుస్తూ తీర్మానం..చాల్చాల్లే ఫో అంటున్న భారత్!