ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ప్రకాశం జిల్లాలోని వైఎస్సార్ అర్బన్ క్లినిక్, యూపీహెచ్‌సీల్లో.. ఒప్పంద/ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన 18 మెడికల్ ఆఫీసర్లు/సీఏఎస్, ఫార్మసిస్ట్ గ్రేడ్-2, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పదో తరగతి, డీఫార్మసీ/బీఫార్మసీ, డిప్లొమా, బీఎస్సీ(ఎంఎల్‌టీ), ఎంబీబీఎస్, మెడికల్ ల్యాబొరేటరీలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నవంబర్ 17, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 42 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఈ అర్హతలున్న అభ్యర్ధులు నవంబర్ 26, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆఫ్‌లైన్ విధానంలో కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా అప్లికేషన్లను పంపించవల్సి ఉంటుంది. సంబంధిత అడ్రస్ లో నేరుగా కూడా సమర్పించవచ్చు. జనరల్ అభ్యర్ధులు రూ.500, ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్ధులు రూ.300లు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. వికలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. విద్యార్హతలు, రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ డిసెంబర్ 5వ తేదీన ప్రకటిస్తారు. అపాయింట్‌మెంట్ ఆర్డర్ డిసెంబర్ 7న మంజూరు చేస్తారు. అర్హత సాధించిన వారికి పోస్టును బట్టి నెలకు రూ.12,000ల నుంచి రూ.53,495 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
The District Medical & Health Officer, Prakasam District, GGH, Compound, Ongole, AP.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.