Digital India Recruitment 2022: డిజిటల్‌ ఇండియాలో ఉద్యోగావకాశాలు.. ఈ అర్హతలుంటే నేరుగా జాబ్ గ్యారెంటీ..

|

Sep 30, 2022 | 10:24 AM

భారత ప్రభుత్వ ఎలక్ట్రీనిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని డిజిటల్ ఇండియా కార్పొరేషన్.. ఒప్పంద ప్రాతిపదికన 10 టెక్ లీడ్, డెవలపర్ (వెబ్), డెవలపర్ (మొబైల్) తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..

Digital India Recruitment 2022: డిజిటల్‌ ఇండియాలో ఉద్యోగావకాశాలు.. ఈ అర్హతలుంటే నేరుగా జాబ్ గ్యారెంటీ..
Digital India
Follow us on

భారత ప్రభుత్వ ఎలక్ట్రీనిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని డిజిటల్ ఇండియా కార్పొరేషన్.. ఒప్పంద ప్రాతిపదికన 10 టెక్ లీడ్, డెవలపర్ (వెబ్), డెవలపర్ (మొబైల్) తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు, ఏదైనా డిగ్రీ, బీఈ, బీటెక్‌, ఎంసీఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తులకు చివరి తేదీ నాటికి అభ్యర్ధుల వయసు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 10, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ప్రభుత్వ/పబ్లిక్‌ సెక్టార్‌/అటానమస్‌ బాడీస్‌లో ఇప్పటికే రెగ్యులర్‌ లేదా ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాలు నిర్వహిస్తున్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. స్క్రీనింగ్‌, విద్యార్హతలు, వయోపరిమితి, పని అనుభవం ఆధారంగా అభ్యర్ధులను ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నిబంధనల మేరకు జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

ఇవి కూడా చదవండి
  • టెక్ లీడ్ పోస్టులు: 1
  • డెవలపర్(వెబ్) పోస్టులు: 1
  • డెవలపర్(మొబైల్) పోస్టులు: 1
  • యూఐ/ యూఎక్స్‌ డిజైనర్ పోస్టులు: 1
  • టెక్ సపోర్ట్ పోస్టులు: 1
  • గ్రాఫిక్స్ డిజైనర్ పోస్టులు: 1
  • డేటాబేస్ పోస్టులు: 1
  • సిస్టమ్ అడ్మిన్ పోస్టులు: 1
  • డెవలప్‌మెంట్‌ ఆపరేషన్స్‌ పోస్టులు: 1
  • డాష్‌బోర్డ్, డేటా అనలిటిక్స్: 1

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.