DSSB Recruitment 2021: నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 7236 పోస్టులతో భారీగా ఉద్యోగాల నియామకం చేపట్టనుంది.
* టీజీటీ విభాగంలో 6258 ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా హిందీ, నేచురల్ సైన్స్, మ్యాథ్స్, సోషల్ సైన్స్, బెంగాలీ సబ్జెక్టులో ఉద్యోగులను తీసుకోనున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. సంబంధిత సబ్జెక్టుల్లో బీఏ(ఆనర్స్), బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సీటెట్‌లో అర్హత సాధించి ఉండాలి.
* ప్రైమరీ, నర్సరీ విభాగాల్లో మొత్తం 628 అసిస్టెంట్ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు నర్సరీ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో డిప్లొమా/ సర్టిఫికెట్ కోర్సు చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకూడదు.
* జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (278) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు మెట్రిక్యులేషన్/ సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లిష్‌లో నిమిషానికి 35 పదాలు, హిందీలో 30 పదాలు టైపింగ్ స్పీడ్ నైపుణ్యం ఉండాలి. అభ్యర్థుల వయసు 18-27 ఏళ్ల మధ్య ఉండాలి.
* కౌన్సెలర్ (50) పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు.. సైకాలజీ/ అప్లైడ్ సైకాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు కౌన్సెలింగ్ సైకాలజీలో పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకూడదు.
* పట్వారీ (10) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు.. గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత పొంది ఉండాలి. కంప్యూటర్ ప్రొఫిషియన్సీతో పాటు ఉర్దూ/ హిందీలో పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 21-27 ఏళ్ల మధ్య ఉండాలి.
* పైన తెలిపిన ఖాళీలకు అభ్యర్థులను వన్ టైర్/ టూ టైర్ ఎగ్జామినేషన్ స్కీం, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
* దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభ తేదీ 25.05.2021 కాగా.. 24.06.2021 చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: Humanity : అనాధ ముస్లిం మహిళకు అంత్యక్రియలు నిర్వహించిన తాడేపల్లిగూడెం సీఐ
HOUSEWISE SURVEY: కరోనా కట్టడికి సర్వే వ్యూహం… తెలంగాణ బాటలో ఏపీ సర్కార్.. ఫలితమిచ్చేనా?