Defence Services Staff College Recruitment 2021: ఇంట‌ర్ అర్హ‌త‌తో డిఫెన్స్ ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..

|

May 05, 2021 | 5:40 AM

Defence Services Staff College Recruitment 2021: డిఫెన్స్ స‌ర్వీసెస్ స్టాఫ్ కాలేజీ (డీఎస్ఎస్‌సీ) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. కేంద్ర ర‌క్ష‌ణ‌శాఖ ప‌రిధిలో ఉండే ఈ డీఎస్ఎస్‌సీ ఉద్యోగాల‌ను...

Defence Services Staff College Recruitment 2021: ఇంట‌ర్ అర్హ‌త‌తో డిఫెన్స్ ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..
Defence Staff Services Staff
Follow us on

Defence Services Staff College Recruitment 2021: డిఫెన్స్ స‌ర్వీసెస్ స్టాఫ్ కాలేజీ (డీఎస్ఎస్‌సీ) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. కేంద్ర ర‌క్ష‌ణ‌శాఖ ప‌రిధిలో ఉండే ఈ డీఎస్ఎస్‌సీ ఉద్యోగాల‌ను రాత‌ప‌రీక్ష‌, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ నోటిఫికేష‌న్ ద్వారా మొత్తం 83 పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు.

ముఖ్య‌మైన విష‌యాలు..

* మొత్తం 83 పోస్టుల్లో భాగంగా మ‌ల్టీటాస్కింగ్ స్టాఫ్ విభాగంలో 60, స్టెనోగ్రాఫ‌ర్ 4, డివిజ‌న్ క్ల‌ర్క్ 10, సివిలియ‌న్ మోటార్ డ్రైవ‌ర్ 7, సుఖాని 1, కార్పెంట‌ర్ 1 చొప్పున భ‌ర్తీ చేయ‌నున్నారు.

* ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు ఇంట‌ర్ లేదా 10+2 ఉత్తీర్ణ‌త సాధించాలి.

* ఈ ఖాళీల‌ను రాత‌ప‌రీక్ష‌, స్కిల్ టెస్ట్ ఆధారంగా భ‌ర్తీ చేయ‌నున్నారు.

* అర్హ‌త‌, ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తుల‌ను మే 22లోపు పంపించాలి.

* రాతపరీక్షలో జనరల్‌ ఇంటెలిజెన్స్‌, రీజనింగ్‌, న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌, జనరల్‌ ఇంగ్లిష్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, ట్రేడ్‌ స్పెసిఫిక్‌ నుంచి ప్రశ్నలు ఉంటాయి.

* పూర్తి వివ‌రాల‌కు dssc.gov.in వెబ్‌సైట్‌ను చూడండి.

Also Read: Hyderabad Fever Survey: మహానగరంలో ఫీవర్ సర్వే .. మంగళవారం ఒక్కరోజే 40 వేల ఇళ్లలో వైద్య పరీక్షలు.. 1,487 మందికి జ్వరం గుర్తింపు

జర్నలిస్ట్‌గా మారనున్న అవికాగోర్.. రియల్ లైఫ్ ? లేదా రీల్ లైఫ్ అంటూ .. సందేహంలో ఫ్యాన్స్..

Suicide: ప్రేమ నిరాకరించిన యువకుడు.. శానిటైజర్ సేవించి యువతి ఆత్మహత్య.. ప్రియుడి ఇంటి ముందు బంధువుల ఆందోళన