DAE Mumbai Jobs 2022: టెన్త్, డిప్లొమా, డిగ్రీ అర్హతతో భారత అటామిక్ ఎనర్జీ కేంద్రంలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక.
భారత ప్రభుత్వ ఆణుశక్తి విభాగానికి చెందిన ముంబాయిలోని డైరెక్టరేట్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ సర్వీసెస్ అండ్ ఎస్టేట్ మేనేజ్‌మెంట్(DCSEM).. టెక్నికల్ ఆఫీసర్ (Technical Officer Posts)..

DAE Scientific Assistant Recruitment 2022: భారత ప్రభుత్వ ఆణుశక్తి విభాగానికి చెందిన ముంబాయిలోని డైరెక్టరేట్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ సర్వీసెస్ అండ్ ఎస్టేట్ మేనేజ్‌మెంట్(DCSEM).. టెక్నికల్ ఆఫీసర్ (Technical Officer Posts), సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 33
ఖాళీల వివరాలు: టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులు.
- టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు: 3 అర్హతలు: మెకానికల్, సివిల్ స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
- సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు: 10 విభాగాలు: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
- టెక్నీషియన్ బి పోస్టులు: 20 ట్రేడులు: ప్లంబింగ్, కార్పెంట్రీ, మాసన్రీ, ఫిట్టర్, ఎయిర్ కండిషనింగ్, ఎలక్ట్రికల్. అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసుండాలి. ఎంపిక విధానం: ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్‌డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్, రిక్రూట్‌మెంట్ సెక్షన్, డైరెక్టరేట్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ సర్వీసెస్ అండ్ ఎస్టేట్ మేనేజ్‌మెంట్, విక్రం సారాభాయ్ భవన్, అణుశక్తి నగర్, ముంబాయ్-400094.
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 29, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read:




