CUK Recruitment: కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీలో టీచింగ్ పోస్ట్‌లు.. నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక..
CUK Recruitment: సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటలో పలు టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కల్బుర్గియాలోని ఈ విద్యా సంస్థలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ...
CUK Recruitment: సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటలో పలు టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కల్బుర్గియాలోని ఈ విద్యా సంస్థలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నేటి (సోమవారం) నుంచి ప్రారంభమైన నేపథ్యంలో ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 61 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో 21 ప్రొఫెసర్ పోస్టులు, 40 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు CA/ICWA, BAD, డిగ్రీ, డాక్టోరల్ డిగ్రీ, MCom, MAD, PGDM, MA, ఆర్ట్స్ / హ్యుమానిటీస్ / సైన్స్ / కామర్స్‌లో మాస్టర్స్ డిగ్రీ, MAD, MA పూర్తి చేసి ఉండాలి. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో PhD కలిగి ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు మొదట ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం హార్డ్ కాపీని ఆఫ్‌లైన్ విధానంలో అందించాల్సి ఉంటుంది.
* ఆన్‌లైన్ దరఖాస్తు ఫామ్‌తో పాటు సంబంధిత సర్టిఫికేట్లను సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక, కడాగాంచి, కర్ణాటక 585367 అడ్రస్‌కు పంపించాలి.
* అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూ ఆధరాంగా ఎంపిక చేస్తారు.
* ఎస్టీ/ఎస్టీలు దరఖాస్తు ఫీజుగా రూ. 10000, జనరల్/బీసీ అభ్యర్థులు రూ. 2500 చెల్లించాల్సి ఉంటుంది.
* ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 30, 2022, హార్డ్ కాపీని సమర్పించడానికి జూలై 8ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..