CSIR-NIST Thiruvananthapuram Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ కామర్స్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన తిరువనంతపురంలోని సీఎస్‌ఐఆర్- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ (CSIR-NIST Thiruvananthapuram).. తాత్కాలిక ప్రాతిపదికన 9 ప్రాజెక్ట్ అసోసియేట్-1, టెక్నికల్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్-II, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల (Project Associate Posts) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సివిల్ ఇంజనీరింగ్/బయోటెక్నాలజీ/బయోకెమిస్ట్రీ స్పెషలైజేషన్‌లో బీటెక్, ఎన్విరాన్‌మెంటల్ టెక్నాలజీ/బయోటెక్నాలజీ/కెమిస్ట్రీ/పాలిమర్ కెమిస్ట్రీ/పాలిమర్ సైన్స్/బయోపాలిమర్ సైన్స్/ఫుడ్ సైన్స్/ఫుడ్ టెక్నీలజీలో మాస్టర్స్ డిగ్రీ, మెకానికల్/కెమికల్ ఇంజనీరింగ్/పాలిమర్/ప్లాస్టిక్/మెకానికల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా, పాలిమర్ కెమిస్ట్రీ/పాలిమర్ సైన్స్/పాలిమర్ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సీఎస్ఐఆర్ యూజీసీ నెట్, గేట్‌లో వ్యాలిడ్ స్కోర్ కూడా ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు 35 నుంచి 50 యేళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 30, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు, ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.42,000ల జీతంతోపాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.