CSIR–IMMT Recruitment 2022: ఇంజనీరింగ్‌ అర్హతతో.. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మినరల్స్‌ అండ్‌ మెటీరియల్స్‌ టెక్నాలజీలో ఉద్యోగాలు..

|

Nov 15, 2022 | 7:29 AM

భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన భువనేశ్వర్‌లోని సీఎస్‌ఐఆర్‌-ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మినరల్స్‌ అండ్‌ మెటీరియల్స్‌ టెక్నాలజీ.. ఒప్పంద ప్రాతిపదికన 25 ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, ప్రాజెస్ట్‌ అసోసియేట్‌ తదితర పోస్టుల..

CSIR–IMMT Recruitment 2022: ఇంజనీరింగ్‌ అర్హతతో.. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మినరల్స్‌ అండ్‌ మెటీరియల్స్‌ టెక్నాలజీలో ఉద్యోగాలు..
CSIR–IMMT Recruitment 2022
Follow us on

భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన భువనేశ్వర్‌లోని సీఎస్‌ఐఆర్‌-ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మినరల్స్‌ అండ్‌ మెటీరియల్స్‌ టెక్నాలజీ.. ఒప్పంద ప్రాతిపదికన 25 ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, ప్రాజెస్ట్‌ అసోసియేట్‌, జేఆర్‌ఎఫ్‌, ప్రాజెక్ట్‌ ఫెలో తదితర పోస్టుల అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌/బీఈ/బీటెక్‌/బీఎస్సీ/డిప్లొమా/ఎంఎస్సీ/పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు పోస్టును బట్టి 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్న అభ్యర్ధులు కింది ఈ మెయిల్‌ ఐడీకి నవంబర్‌ 24, 2022వ తేదీలోపు దరఖాస్తులు పంపించవచ్చు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.17,000ల నుంచి రూ.56,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఈమెయిల్‌ ఐడీ:

పోస్టును బట్టి ఆయా ఈమెయిల్‌ ఐడీకు దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి
  • barsham@immt.res.in
  • simantini@immt.res.in
  • silanisahoo@immt.res.in
  • atripathy@immt.res.in
  • ldbesra@immt.res.in
  • mustakim@immt.res.in
  • dpdas@immt.res.in
  • bankim@immt.res.in
  • rbarik@immt.res.in
  • mamata@immt.res.in

ఇతర పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.