భారత ప్రభుత్వ రంగానికి చెందిన న్యూఢిల్లీలోని సీఎస్‌ఐఆర్ – సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్.. సైంటిస్ట్ గ్రేడ్-4 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఈ, ఎంటెక్, ఎంఎస్, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 32 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు మార్చి 29, 2023వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.500లు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మహిళలు/ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు ఫీజు చెల్లించనవసరం లేదు. రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.1,21,641ల చొప్పున జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.