TGPSC Group 2, 3 Exam: ‘తెలంగాణ గ్రూప్‌ 2, 3 పరీక్షల తేదీలను మార్చాలి.. నెల రోజులు వాయిదా వేయాలి’

|

Jul 16, 2024 | 7:02 AM

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల నిరసనలు మిన్నంటు తున్నాయి. డీఎస్సీ పరీక్షలు ముగిసిన ఒక రోజు తర్వాత గ్రూప్‌ 2 పరీక్షలు ప్రారంభం అవుతాయి. ఇలా పక్కపక్కనే వ్యవధానం లేకుండా పరీక్ష తేదీలు ఉండటంతో అభ్యర్ధుల్లో అందోళన నెలకొంది. దీంతో డీఎస్సీ పరీక్షతోపాటు గ్రూప్‌ 2, 3 పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులు దర్నాలు, నిరాహార దీక్షలు చేపడుతున్నా.. ప్రభుత్వం తీరులో మార్పు కానరావడం లేదు..

TGPSC Group 2, 3 Exam: తెలంగాణ గ్రూప్‌ 2, 3 పరీక్షల తేదీలను మార్చాలి.. నెల రోజులు వాయిదా వేయాలి
TGPSC Group 2, 3 Exams
Follow us on

హైదరాబాద్‌, జులై 16: తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల నిరసనలు మిన్నంటు తున్నాయి. డీఎస్సీ పరీక్షలు ముగిసిన ఒక రోజు తర్వాత గ్రూప్‌ 2 పరీక్షలు ప్రారంభం అవుతాయి. ఇలా పక్కపక్కనే వ్యవధానం లేకుండా పరీక్ష తేదీలు ఉండటంతో అభ్యర్ధుల్లో అందోళన నెలకొంది. దీంతో డీఎస్సీ పరీక్షతోపాటు గ్రూప్‌ 2, 3 పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులు దర్నాలు, నిరాహార దీక్షలు చేపడుతున్నా.. ప్రభుత్వం తీరులో మార్పు కానరావడం లేదు. పైగా ఆందోళన చేపడుతున్న నిరుద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగించి పెద్దఎత్తున అరెస్టులు చేసింది. ఈ చర్యలను సీపీఎం ఖండిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఎక్కువ శాతం డీఎస్సీ అభ్యర్థులే గ్రూప్‌ 2, 3 పరీక్షలు రాయబోతున్నారని ఆయన అన్నారు. ఆగస్టు 5వ తేదీతో డీఎస్సీ పరీక్షలు ముగుస్తున్నాయి. మధ్యలో ఒక్కరోజు మాత్రమే గ్యాప్‌ ఉంది.. ఆగస్టు 7, 8 తేదీల్లో టీజీపీఎస్సీ గ్రూప్స్‌ పరీక్షలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. దీంతో అభ్యర్థులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు. పరీక్షలకు కనీసం నెల రోజుల సమయం ఇవ్వాలని విద్యార్థులు కోరడంలో న్యాయం ఉందని నిరుద్యోగుల పక్షాన ప్రభుత్వానికి విన్నవించారు. కానీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని తమ్మినేని మండిపడ్డారు.

వెంటనే గ్రూప్స్‌ పరీక్షల తేదీలను మార్చాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల సమయంలో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చి.. కేవలం 11,062 పోస్టులకే నోటిఫికేషన్‌ ఇవ్వడం సరైంది కాదని అన్నారు. కాగా మొత్తం 18 విభాగాల్లో 783 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ గత ఏడాది గ్రూప్‌ 2 ఉద్యోగ ప్రకటన జారీచేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 5,51,943 మంది అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే మూడు సార్లు వివిధ కారణాలతో గ్రూప్‌ 2 వాయిదా పడింది. కొందరి ప్రయోజనాల కోసం నిరుద్యోగులకు అన్యాయం చేయకూడదన్న లక్ష్యంతోనే పరీక్షలను వాయిదా వేయడంలేదని ఇప్పటికే సీఎం పలుమార్లు మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.