Coal India Recruitment: కోల్‌ ఇండియా లిమిటెడ్‌లో మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టులు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

|

Jul 02, 2022 | 7:16 PM

Coal India Recruitment: కోల్‌ ఇండియా లిమిటెడ్‌లో మేనేజ్‌మెంట్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. భారత ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వశాఖకు చెందిన మహారత్న సంస్థలో...

Coal India Recruitment: కోల్‌ ఇండియా లిమిటెడ్‌లో మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టులు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
Coal India
Follow us on

Coal India Recruitment: కోల్‌ ఇండియా లిమిటెడ్‌లో మేనేజ్‌మెంట్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. భారత ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వశాఖకు చెందిన మహారత్న సంస్థలో ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 481 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 481 మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పర్సనల్‌ అండ్‌ హెచ్‌ఆర్‌, ఎన్విరాన్‌మెంట్‌, మెటీరియల్స్‌ మేనేజ్‌మెంట్‌, మార్కెటింగ్‌, సేల్స్‌, కమ్యునిటీ డెవలప్‌మెంట్‌, లీగల్‌, పబ్లిక్‌ రిలేషన్స్‌ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ/ ఇంజినీరింగ్‌ డిగ్రీ/ పీజీ/ పీజీ డిప్లొమా/ ఎంబీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌లో సాధించిన మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 50,000 నుంచి రూ. 1.6 లక్షల వరకు చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 08-07-2022న మొదలై 07-08-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..