AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coal India Jobs: డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ బొగ్గు గనుల విభాగంలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే కోల్ ఇండియా లిమిటెడ్ లో డిగ్రీ అర్హతతో భారీ ప్యాకేజీతో ఉద్యోగాల భర్తీకి తాజాగా ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ఎలాంటి రాత పరీక్ష, ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండానే నేరుగా ఉద్యోగాలు పొందొచ్చు. విద్యార్హతల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అక్టోబర్ 29, 2024వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది..

Coal India Jobs: డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ బొగ్గు గనుల విభాగంలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక
Coal India Limited
Srilakshmi C
|

Updated on: Oct 27, 2024 | 1:54 PM

Share

భారత ప్రభుత్వ బొగ్గు గనుల మంత్రిత్వశాఖకు చెందిన కోల్‌కతాలోని కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) దేశ వ్యాప్తంగా ఉన్న కోల్‌ ఇండియా కేంద్రాలు, వాటి అనుబంధ సంస్థల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 640 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేస్తారు. బ్యాచిలర్స్‌ డిగ్రీతోపాటు గేట్‌ 2024 ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నవంబర్‌ 11, 2024వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని కోల్‌ ఇండియా ప్రకటించింది.

కేటగిరీల వారీగా ఖాళీల వివరాలు..

640 మేనేజ్‌మెంట్ ట్రైనీ ఇ-2 గ్రేడ్‌ పోస్టుల్లో జనరల్ కేటగిరీలో 190 పోస్టులు, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో 43 పోస్టులు, ఎస్సీ కేటగిరీలో 67 పోస్టులు, ఎస్టీ కేటగిరీలో 34 పోస్టులు, ఓబీసీ కేటగిరీలో 124 పోస్టులు ఉన్నాయి.

విభాగాల వారీగా ఖాళీలు ఎలా ఉన్నాయంటే..

  • మైనింగ్ విభాగంలో పోస్టులు సంఖ్య: 263
  • సివిల్ విభాగంలో పోస్టులు సంఖ్య: 91
  • ఎలక్ట్రికల్ విభాగంలో పోస్టులు సంఖ్య: 102
  • మెకానికల్ విభాగంలో పోస్టులు సంఖ్య: 104
  • సిస్టమ్ విభాగంలో పోస్టులు సంఖ్య: 41
  • ఎలక్ట్రానిక్స్ అండ్‌ టెలికమ్యూనికేషన్ విభాగంలో పోస్టులు సంఖ్య: 39

ఎవరు అర్హులంటే..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు కనీసం 60 శాతం మార్కులతో మైనింగ్/ సివిల్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌ స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీలో లేదా కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ ఇంజినీరింగ్/ ఐటీ/ ఎలక్ట్రానిక్స్ అండ్‌ టెలికమ్యూనికేషన్ విభాగంలో బీఈ, బీటెక్‌లో లేదా ఎంసీఏలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. వీటితో పాటు గేట్‌ 2024లో తప్పనిసరిగా అర్హత సాధించి ఉండాలి. వయో పరిమితి కింద సెప్టెబర్‌ 30, 2024 నాటికి అభ్యర్ధుల వయసు 30 సంవత్సరాలు మించకుండా ఉండాలి.

ఇవి కూడా చదవండి

ఈ అర్హతలున్న వారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో నవంబర్‌ 28వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు అక్టోబర్‌ 29, 2024వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఎలాంటి రాత పరీక్ష నిర్వహిచకుండానే విద్యార్హతలు, గేట్-2024 స్కోర్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. దరఖాస్తు సమయంలో జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.1180 రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు వర్తిస్తుంది. ఎంపికైన వారికి జీత భత్యాల కింద నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి