CME Recruitment 2023: పది/ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు రూ.81,100ల జీతంతో..

|

Feb 14, 2023 | 9:29 PM

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన పుణెలోని కాలేజ్‌ ఆఫ్‌ మిలిటరీ ఇంజినీరింగ్‌ (సీఎంఈ).. 119 అకౌంటెంట్‌, సీనియర్‌ మెకానిక్‌, ల్యాబొరేటరీ అసిస్టెంట్‌ తదితర పోస్టుల భర్తీకి..

CME Recruitment 2023: పది/ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు రూ.81,100ల జీతంతో..
College Of Military Engineering
Follow us on

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన పుణెలోని కాలేజ్‌ ఆఫ్‌ మిలిటరీ ఇంజినీరింగ్‌ (సీఎంఈ).. 119 అకౌంటెంట్‌, సీనియర్‌ మెకానిక్‌, ల్యాబొరేటరీ అసిస్టెంట్‌, ఎల్‌డీసీ, స్టోర్‌కీపర్‌, కుక్‌, ఫిట్టర్‌, మౌల్డర్‌, కార్పెంటర్‌, ఎలక్ట్రీషియన్‌, స్టోర్‌మ్యాన్‌, ఎంటీఎస్‌, లస్కర్‌ తదితర గ్రూప్‌ ‘సీ’ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేటగిరీల వారీగా పోస్టుల వివరాలు ఇలా.. ఎస్సీ కేటగిరీలో 27, ఎస్టీ కేటగిరీలో 7, ఓబీసీ కేటగిరీలో 26, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో 11, అన్‌రిజర్వ్‌డ్‌ కేటగిరీలో 48 పోస్టులున్నాయి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి మెట్రిక్యులేషన్‌, సంబంధిత స్పెషలైజేషన్‌లో 12వ తరగతి/ఐటీఐ/బీఎస్సీ/డిగ్రీబీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌/ఎంఎస్సీ/పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 25 యేళ్ల మధ్య ఉండాలి.ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో మార్చి 4, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. స్క్రీనింగ్‌, రాతపరీక్ష, స్కిల్‌/ ప్రాక్టికల్‌ పరీక్షలో ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపికైన వారికి నెలకు రూ.18,000ల నుంచి రూ.81,100ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.