నేటితో ముగుస్తున్న CLAT 2023 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ..

|

Nov 18, 2022 | 9:21 AM

లా యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే క్లాట్-2023 పరీక్షకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నేటితో ముగుస్తుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో నవంబర్‌ 12వ (ఈరోజు) తేదీ ముగింపు సమయంలోపు దరఖాస్తు..

నేటితో ముగుస్తున్న CLAT 2023 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ..
CLAT 2023
Follow us on

లా యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే క్లాట్-2023 పరీక్షకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నేటితో ముగుస్తుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో నవంబర్‌ 12వ (ఈరోజు) తేదీ ముగింపు సమయంలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్‌ పూర్తి చేసిన విద్యార్ధులతోపాటు, ఈ ఏడాది బోర్డు పరీక్షలకు హాజరయ్యే వారు కూడా ఎల్ఎల్‌బీ (యూజీ)కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన అభ్యర్ధులు లేదా ఎల్‌ఎల్‌బీ చివరి సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్ధులు క్లాట్‌ ఎల్‌ఎల్‌ఎమ్‌ (పీజీ)కు దరఖాస్తు చేసుకోవచ్చు.

కాగా లా కోర్సుల్లో అండర్ గ్రాడ్యుయేట్‌, పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రవేశాలకు కన్సార్టియం ఆప్‌ నేషన్‌ లా యూనివర్సిటీస్‌ (ఎన్‌ఎల్‌యూ) ప్రతీ యేట కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌) నిర్వహిస్తోన్న సంగతి తెలిందే. 2023-24 విద్యాసంవత్సరానికిగానూ ఈ ఏడాది కూడా క్లాట్‌ పరీక్ష నిర్వహించనుంది. దీనిలో సాధించిన ర్యాంకు ఆధారంగా దేశంలోని 22 నేషనల్ లా యూనివర్సిటీలు, అఫిలియేట్‌ యూనివర్సిటీల్లో సీట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇక క్లాట్‌-2023 పరీక్ష డిసెంబర్‌ 18న దేశ వ్యాప్తంగా పలు పరీక్షకేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన శాంపిల్‌ క్వశ్చన్ పేపర్లు, ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.