CLAT 2022: మరికొన్ని గంటల్లో ప్రారంభంకానున్న క్లాట్‌ 2022 పరీక్ష

|

Jun 19, 2022 | 7:39 AM

కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT 2022) ఈ రోజు మరికొన్ని గంటల్లో (జూన్ 19న) దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనున్నట్లు కన్సార్టియం లా యూనివర్సిటీస్‌ (NLUs) తెల్పింది..

CLAT 2022: మరికొన్ని గంటల్లో ప్రారంభంకానున్న క్లాట్‌ 2022 పరీక్ష
Clat 2022
Follow us on

CLAT 2022 to be held as per schedule: కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT 2022) ఈ రోజు మరికొన్ని గంటల్లో (జూన్ 19న) దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనున్నట్లు కన్సార్టియం లా యూనివర్సిటీస్‌ (NLUs) తెల్పింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా దేశంలో పలు రాష్ట్రాల్లో నిరసనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో కన్సార్టియం శనివారం సమావేశమైంది. ఈ సమావేశం అనంతరం పరీక్ష యథాతథంగా ఆదివారం (జూన్‌ 19) మధ్యహ్నం జరుగుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసింది. తాజా ప్రకటన ప్రకారం.. ముందుగా నిర్ణయించిన ప్రకారంగా జూన్ 19 (ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్య కామన్ లా అడ్మిషన్ టెస్ట్ 2022 (క్లాట్‌) దేశ వ్యాప్తంగా 25 రాష్ట్రాల్లో 131 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరుగుతుంది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు, స్టాఫ్‌, ఇతర సిబ్బంది కోవిడ్ 19 నిబంధనల ప్రకారం పరీక్షకు హాజరవ్వాలని, పరీక్ష వాయిదావేయడం లేదని వివరణ ఇచ్చింది. పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులు హాల్‌ టికెట్లతో నిర్ణీత సమయానికి ఆయా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించింది.

మొత్తం 150 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకుగానూ 2 గంటల సమయంలో ఆఫ్‌లైన్‌ పద్ధతిలో పరీక్ష ఉంటుంది. నెగెటివ్‌ మార్కింగ్‌ కూడా ఉంటుంది. కాగా బీఏ ఎల్ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎమ్‌ వంటి లా కోర్సుల్లో ప్రవేశాలకు కన్సార్టియం క్లాట్‌ పరీక్షను నిర్వహిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.