CISF నుంచి హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టులు.. అర్హతలు, జీతభత్యాలు ఎలా ఉన్నాయంటే..?

|

Jan 02, 2022 | 4:49 PM

CISF Recruitment 2021: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ (GD) పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

CISF నుంచి హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టులు.. అర్హతలు, జీతభత్యాలు ఎలా ఉన్నాయంటే..?
Follow us on

CISF Recruitment 2021: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ (GD) పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పోస్ట్‌లను స్పోర్ట్స్‌ కోటా కింద భర్తీ చేస్తారు. అప్లై చేయాలనుకునే అభ్యర్థులు CISF అధికారిక వెబ్‌సైట్ cisf.gov.inని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. CISF మొత్తం 249 హెడ్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. అభ్యర్థులు ఈ పోస్టులకు 31 మార్చి 2022 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇదే చివరితేదీ.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు CISF GD హెడ్ కానిస్టేబుల్ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు. 12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. అయితే జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయిలో క్రీడలు ఆడడం అవసరం. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్థికి దేశంలో లేదా విదేశాలలో ఎక్కడైనా పోస్టింగ్ ఇవ్వవచ్చు. మీరు 02 ఆగస్టు 1998 నుంచి 01 ఆగస్టు 2003 మధ్య జన్మించి ఉండాలి.

ఈ క్రీడలకు చెందిన పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అథ్లెటిక్స్, బాక్సింగ్, బాస్కెట్‌బాల్, జిమ్నాస్టిక్స్, ఫుట్‌బాల్, హాకీ, హ్యాండ్ బాల్, జూడో, కబడ్డీ, షూటింగ్, స్విమ్మింగ్, వాలీ బాల్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, టైక్వాండో

ఎంపిక ప్రక్రియ
ఫిజికల్ సెలక్షన్ టెస్ట్ (PST), డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రయల్ టెస్ట్, ప్రొఫిషియన్సీ టెస్ట్ ఫలితాల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థికి లెవెల్-4 పే మ్యాట్రిక్స్ ఆధారంగా నెలకు రూ.25,500 జీతం అందుతుంది.

దరఖాస్తు ప్రక్రియ
CISF హెడ్ కానిస్టేబుల్ GD 2021 ఖాళీ కోసం దరఖాస్తు ఆఫ్‌లైన్ మోడ్‌లో నిర్వహిస్తారు. నోటిఫికేషన్‌తో పాటు దరఖాస్తు ఫారమ్‌ను విడుదల చేసింది. మీరు దిగువ ఇచ్చిన నోటిఫికేషన్ లింక్ నుంచి ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు. తర్వాత ఆ ఫారమ్‌ను సరిగ్గా నింపి, నోటిఫికేషన్‌లో ఇచ్చిన చిరునామాకు రూ. 100 పోస్టల్ ఆర్డర్ లేదా SBI DDతో పాటు పంపించాల్సి ఉంటుంది.

Jio, Airtel, Vi రూ. 666 రీఛార్జ్ ప్లాన్‌లో తేడాలేంటి..? వ్యాలిడిటీ, ఫీచర్స్‌, బెనిఫిట్స్‌ తెలుసుకోండి..

ఇంట్లో గోడలకు తాజ్‌మహల్‌, మహాభారతం, యుద్ద చిత్రాల ఫొటోలున్నాయా..! వాస్తు ప్రకారం ఏం జరుగుతుందంటే..?

అన్నదాతలకు శుభవార్త.. వ్యవసాయ రుణ లక్ష్యం పెంచే యోచనలో ప్రభుత్వం.. ఎంతమేరకంటే..?