నిరుద్యోగులకు శుభవార్త.. CISFలో కానిస్టేబుల్ పోస్ట్‌లు.. అర్హత 12వ తరగతి.. ?

|

Jan 30, 2022 | 10:46 AM

CISF Constable Recruitment 2022:12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులకు భద్రతా దళంలో ఉద్యోగం పొందే గొప్ప అవకాశం వచ్చింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్

నిరుద్యోగులకు శుభవార్త.. CISFలో కానిస్టేబుల్ పోస్ట్‌లు.. అర్హత 12వ తరగతి.. ?
Follow us on

CISF Constable Recruitment 2022:12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులకు భద్రతా దళంలో ఉద్యోగం పొందే గొప్ప అవకాశం వచ్చింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) కానిస్టేబుల్ పోస్టుల కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో మొత్తం 1149 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అభ్యర్థులు CISF అధికారిక వెబ్‌సైట్, cisf.gov.in ని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ 29 జనవరి 2021 నుంచి ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న నోటిఫికేషన్ ద్వారా పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు.

CISF కానిస్టేబుల్ లేదా ఫైర్‌మెన్ (పురుషుడు) రిక్రూట్‌మెంట్ 2022 కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అర్హత గల అభ్యర్థులు 04 మార్చి 2022 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈ రిక్రూట్‌ మెంట్ జరుగుతోంది.

ఎలా దరఖాస్తు చేయాలి..?

1. దరఖాస్తు చేయడానికి ముందుగా అధికారిక వెబ్‌సైట్- cisfrectt.inకి వెళ్లండి.

2. వెబ్‌సైట్ హోమ్ పేజీలో ఇచ్చిన నోటీసు బోర్డు ఎంపికకు వెళ్లండి.

3. ఇందులో మీరు కానిస్టేబుల్-ఫైర్ 2021 కోసం అప్లికేషన్ పోర్టల్ లింక్‌కి వెళ్లండి

4. అప్లై ఆన్‌లైన్ లింక్‌పై క్లిక్ చేయండి.

5. ఆ తర్వాత అడిగిన వివరాలను నింపడం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.

6. రిజిస్ట్రేషన్ తర్వాత మీరు దరఖాస్తు ఫారమ్‌ను నింపవచ్చు.

7. దరఖాస్తును పూర్తి చేసిన తర్వాత దాని ప్రింట్ అవుట్ తీసుకోండి.

అర్హత & వయో పరిమితి

ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి సైన్స్ స్ట్రీమ్‌లో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 18 ఏళ్లు, 23 ఏళ్లు మించకూడదు. అభ్యర్థుల ఎత్తు 170 సెంటీమీటర్లు, ఛాతీ 80-85 సెంటీమీటర్లు ఉండాలి. అర్హతకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా పరిశీలించండి.

ఖాళీ వివరాలు

CISF మొత్తం 1149 కానిస్టేబుల్ లేదా ఫైర్‌మెన్ పోస్టులను భర్తీ చేస్తుంది. వీటిలో జనరల్ కేటగిరీకి 489 సీట్లు ఖరారు చేశారు. మరోవైపు, ఓబీసీకి 249, ఈడబ్ల్యూఎస్‌కు 113, ఎస్సీకి 161, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 137 సీట్లు భర్తీ కానున్నాయి.

ఎంపిక ఇలా ఉంటుంది..?

ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులు ఎంపికవుతారు. చివరగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.

QR కోడ్‌ స్కాన్ చేస్తున్నారా జాగ్రత్త.. ఒక్క పొరపాటు మీ ఖాతాని ఖాళీ చేస్తుంది..?

ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్యాసింజర్, స్కూల్ బస్సులలో అవి తప్పనిసరి..?

ఎల్‌ఐసీలో మీ డబ్బు నిలిచిపోయిందా.. పాలసీ డబ్బులు రీఫండ్‌ కావడం లేదా.. ఇలా చేయండి..?