Inter Exams: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఇంటి నుంచే పరీక్షలు.. వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం

Inter Exams: కరోనా నేపథ్యంలో ఈ ఏడాది విద్యాసంవత్సరం అంతా గందరగోళంగా కొనసాగుతోంది. ముఖ్యంగా విద్యార్థుల పరీక్షల విషయంలో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తం.

Inter Exams: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఇంటి నుంచే పరీక్షలు.. వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం
Follow us
Subhash Goud

|

Updated on: May 23, 2021 | 6:55 PM

Inter Exams: కరోనా నేపథ్యంలో ఈ ఏడాది విద్యాసంవత్సరం అంతా గందరగోళంగా కొనసాగుతోంది. ముఖ్యంగా విద్యార్థుల పరీక్షల విషయంలో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. కోవిడ్‌ ప్రభావం విద్యార్థులపై చాలా పడింది. దీంతో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించే విషయంలో రాష్ట్రాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేయడమో లేక వాయిదా వేయడమో చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ఇంటర్మీడియేట్‌ 12వ తరగతి పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలను ఓపెన్‌ బుక్‌ విధానంలో నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం విడుదల చేసింది. జూన్‌ 1 నుంచి 5వ తేదీలోపు విద్యార్థి ఎప్పుడైనా పరీక్ష ప్రశ్నాపత్రాన్ని, కీని తీసుకోవచ్చు. పరీక్ష రాసిన ఐదు రోజులకు సమాధాన పత్రాన్ని ఇన్వజిలేటర్‌కు సమర్పించాల్సి ఉంటుంది. ఉదాహరణకు విద్యార్థి ఐదో తేదీన పశ్నాపత్రాన్ని తీసుకెళితే 10వ తేదీన సమర్పించాల్సి ఉంటుంది. సమాధాన పత్రాన్ని పోస్టులో పంపితే అనుమతించరు. మొత్తం 2 లక్షల 90 వేల మంది విద్యార్థులు  12 వ తరగతి బోర్డు వద్ద నమోదు చేసుకున్నారు.

ఇవీ కూడా చదవండి:

CBSE Exams: కోవిడ్ ప్రోటోకాల్‌ల మధ్య సీబీఎస్ఈ 12వ త‌ర‌గ‌తి ప‌రీక్షలు…! ఉన్న‌త స్థాయి స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యం

TS 10th Results: తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ఆగ‌స్టులో ఒరిజిన‌ల్ మెమోలు.. సెక్యూరిటీ ఫీచ‌ర్ల‌తో ముద్ర‌ణ‌..