AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆఫీస్‌ ఫనుల్లో మారుతున్న ట్రెండ్.. ఉద్యోగుల షాకింగ్ నిర్ణయాలకు కారణాలు ఇవేనా?

దేశంలో మరో కొత్త ట్రెండ్ వచ్చింది. ఉద్యోగంలో చేరిన కొత్తలో ఉండే ఉత్సాహం ఇప్పుడు ఎవరిలోనూ కనిపించడం లేదు. కేవలం జీతం కోసం మాత్రమే పనిచేస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఉదయం ఆఫీసుకు వెళ్లి సాయంత్రం రావడం తప్ప, కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన ఎవరిలోనూ ఉండటం లేదు. దీనినే నిపుణులు 'క్వయిట్ క్విట్టింగ్' అని పిలుస్తున్నారు. ఈ ట్రెండ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

ఆఫీస్‌ ఫనుల్లో మారుతున్న ట్రెండ్.. ఉద్యోగుల షాకింగ్ నిర్ణయాలకు కారణాలు ఇవేనా?
Quiet Quitting India
Anand T
|

Updated on: Apr 10, 2026 | 10:57 AM

Share

తాజా అధ్యయనాల ప్రకారం ఈ నిశ్శబ్ద నిష్క్రమణలో భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఆఫీసుకు వస్తున్నా కూడా మానసికంగా అక్కడి వాతావరణానికి దూరంగా ఉంటున్న వారి సంఖ్య మన దగ్గరే ఎక్కువ. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతీయ ఉద్యోగుల్లోనే ఈ తరహా నిరాసక్తత అధికంగా ఉన్నట్లు తేలింది. సంస్థల పట్ల, తమ వృత్తి పట్ల ఎలాంటి మక్కువ లేకుండా యాంత్రికంగా విధులు నిర్వర్తిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం పనిభారం, తీవ్రమైన ఒత్తిడి. ఉదయం నుంచి రాత్రి వరకు ఆఫీసు పనులతోనే గడపడం వల్ల వ్యక్తిగత జీవితానికి సమయం దొరకడం లేదు. కుటుంబంతో గడిపే అవకాశం లేకపోవడంతో మానసికంగా కుంగిపోతున్నారు ఉద్యోగులు. దీంతో ఆఫీసు పనుల పట్ల విరక్తి చెంది, కేవలం తమకు అప్పగించిన బాధ్యతలను మాత్రమే మొక్కుబడిగా పూర్తి చేస్తున్నారు. అదనపు బాధ్యతలు తీసుకోవడానికి ససేమిరా అంటున్నారు.

కార్యాలయాల్లో ఉండే టాక్సిక్ వాతావరణం కూడా ఉద్యోగుల మానసిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కష్టపడి పనిచేసినా తగిన గుర్తింపు రాకపోవడం వారిని మరింత నిరాశకు గురిచేస్తోంది. పై అధికారుల వేధింపులు, రాజకీయాలు కూడా ఉద్యోగులను మానసికంగా దెబ్బతీస్తున్నాయి. దీంతో సంస్థ అభివృద్ధి గురించి కాకుండా కేవలం తమ నెలసరి ఆదాయం గురించే ఆలోచించే పరిస్థితి దాపురించింది.

పెరుగుతున్న ఖర్చులకు తగ్గట్లుగా వేతనాలు పెరగకపోవడం మరో ప్రధాన సమస్య. ఎంతో కష్టపడి అదనపు సమయం పనిచేసినా, దానికి తగిన ప్రతిఫలం దక్కడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. సంస్థలు కేవలం తమ లాభాల గురించే ఆలోచిస్తూ, ఉద్యోగుల సంక్షేమాన్ని గాలికొదిలేస్తున్నాయనే భావన వారిలో బలపడింది. అందుకే ఇచ్చిన జీతానికి ఎంత చేయాలో అంతే చేయాలనే నిర్ణయానికి వస్తున్నారు.

ఈ ట్రెండ్ వల్ల సంస్థలకే కాకుండా ఉద్యోగుల కెరీర్ కు కూడా ప్రమాదమేనని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా మానసికంగా దూరంగా ఉండటం వల్ల వారిలో సృజనాత్మకత నశిస్తుందని చెబుతున్నారు. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలనే ఆసక్తి సన్నగిల్లి, ఒకే దగ్గర ఉండిపోయే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు. ఇది దీర్ఘకాలంలో వారి వ్యక్తిగత ఎదుగుదలకు తీవ్ర ఆటంకంగా మారుతుందని చెబుతున్నారు.

ఈ సమస్య నుంచి బయటపడాలంటే సంస్థలు తమ విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్యోగుల మానసిక ఆరోగ్యానికి పెద్దపీట వేయాలి. వారికి తగిన గుర్తింపు, ప్రోత్సాహకాలు అందించడంతో పాటు పని గంటలను క్రమబద్ధీకరించాలి. అప్పుడే ఈ ‘క్వయిట్ క్విట్టింగ్’ మహమ్మారిని తరిమికొట్టి, ఆరోగ్యకరమైన పని వాతావరణాన్ని నిర్మించడానికి సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని కేరీర్ అండ్ ఉద్యోగాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఆఫీసుల్లో మారుతున్న ట్రెండ్.. ఉద్యోగుల షాకింగ్ నిర్ణయాలకు కారణాలు
ఆఫీసుల్లో మారుతున్న ట్రెండ్.. ఉద్యోగుల షాకింగ్ నిర్ణయాలకు కారణాలు
యద్ధంలో అమెరికా ఓటమి..! సంచలనం రేపుతున్న చైనా చరిత్రకారుడి జోస్యం
యద్ధంలో అమెరికా ఓటమి..! సంచలనం రేపుతున్న చైనా చరిత్రకారుడి జోస్యం
చిలుకే కాదండోయ్.. పంది కూడా జాతకం చెబుతుందని తెలుసా?
చిలుకే కాదండోయ్.. పంది కూడా జాతకం చెబుతుందని తెలుసా?
నన్ను ఐరెన్ లెగ్ అంటున్నారు..
నన్ను ఐరెన్ లెగ్ అంటున్నారు..
ఇండక్షన్ పై వంట త్వరగా అవ్వాలా..ఈ సింపుట్‌ ట్రిక్స్ పాటిస్తే చాలు
ఇండక్షన్ పై వంట త్వరగా అవ్వాలా..ఈ సింపుట్‌ ట్రిక్స్ పాటిస్తే చాలు
వాషింగ్ మెషీన్‌లో బట్టలు వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..
వాషింగ్ మెషీన్‌లో బట్టలు వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..
ముకుల్ గురించి ముందే హెచ్చరించిన అర్జున్ టెండూల్కర్
ముకుల్ గురించి ముందే హెచ్చరించిన అర్జున్ టెండూల్కర్
అసలు అక్షయ తృతీయ అంటే ఏంటీ.. ఈ రోజు తప్పక బంగారమే కొనుగోలు చేయాలా
అసలు అక్షయ తృతీయ అంటే ఏంటీ.. ఈ రోజు తప్పక బంగారమే కొనుగోలు చేయాలా
అమాయకంగా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఓ సెన్సేషన్
అమాయకంగా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఓ సెన్సేషన్
ఎండలోకి వెళ్లగానే మీకు ఇలా అనిపిస్తుందా.. అయితే డేంజర్‌లో..
ఎండలోకి వెళ్లగానే మీకు ఇలా అనిపిస్తుందా.. అయితే డేంజర్‌లో..