Air India: ఎయిరిండియా ఉద్యోగులకు ఊహించని షాకిచ్చిన కేంద్రం.. వేతనాల్లో కోత విధించాలంటూ టాటా గ్రూప్‌కి ఆదేశాలు

|

Dec 29, 2022 | 6:44 PM

ఎయిరిండియా ఉద్యోగులకు ఊహించని షాకిచ్చింది కేంద్రం. జీతాల్లో కోత పెట్టాలంటూ టాటా గ్రూప్‌ని ఆదేశించింది. ఎందుకలా చేసింది?. ఉద్యోగులు ఏం తప్పు చేశారు?  

Air India: ఎయిరిండియా ఉద్యోగులకు ఊహించని షాకిచ్చిన కేంద్రం.. వేతనాల్లో కోత విధించాలంటూ టాటా గ్రూప్‌కి ఆదేశాలు
Air India Employees
Follow us on

ఎయిరిండియాను టాటా గ్రూప్‌ టేకోవర్‌ చేసినా, ఉద్యోగులు మాత్రం ఇంకా ప్రభుత్వ నివాసాల్లోనే ఉండటంపై యాక్షన్‌లోకి దిగింది కేంద్రం. అధికారిక నివాసాలను ఖాళీ చేయాలని పదేపదే ఆదేశించినా అక్కడే ఉండటాన్ని సీరియస్‌గా పరిగణించింది. ఎవరైతే అధికారిక నివాసాలను ఖాళీ చేయలేదో.. ఆ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాలంటూ టాటా గ్రూప్‌ని ఆదేశించింది. ఎయిరిండియా .. భారత ప్రభుత్వం ఆధీనంలో ఉండగా ఉద్యోగులకు ఢిల్లీ, ముంబైల్లో నివాసాలు కేటాయించింది. అయితే, ఎయిరిండియా.. టాటా గ్రూప్‌ చేతుల్లోకి వెళ్లగానే అధికారిక నివాసాలను ఖాళీ చేయాలని ఆదేశించింది. ఈ ఏడాది జులైలో ఈ ఉత్తర్వులిచ్చింది కేంద్రం. అప్పట్నుంచి గడువు పొడిగించాలని కోరుతూ వస్తోన్న ఉద్యోగులు, రీసెంట్‌ కోర్టును ఆశ్రయించారు. నెక్ట్స్‌ ఇయర్‌ వరకు అవకాశం కల్పించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ న్యాయస్థానాకి విజ్ఞప్తిచేశారు.

బలవంతంగా ఖాళీ చేయించాలని చూస్తున్నారని, అక్టోబర్‌లో ఓసారి వాటర్ సప్లై కూడా నిలిపివేశారంటూ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, ఉద్యోగుల యాక్షన్‌కు రీయాక్షన్‌లా వేతనాల్లో కోత విధించాలంటూ టాటా గ్రూప్‌ని ఆదేశించింది కేంద్రం. నెలకు దాదాపు 95వేల రూపాయలు వసూలు చేయాలంటూ ఆర్డర్స్‌ ఇచ్చింది. కేంద్రం ఆదేశాలపై మండిపడుతున్నారు ఎయిరిండియా ఉద్యోగులు. 95వేలు కట్‌ చేశాక తమ చేతికొచ్చిదేమీ ఉండదని వాపోతున్నారు. ఎయిరిండియాను టాటా గ్రూప్‌ టేకోవర్‌ చేసినా, ఉద్యోగుల నివాసాలు మాత్రం అందులో చేర్చలేదు. ఈ ప్రాపర్టీస్‌ని అసెట్‌ హోల్డింగ్స్‌కి బదిలీ చేసింది కేంద్రం. ఈ ఆస్తుల విక్రయం ద్వారా మిగిలిన 60వేల కోట్ల రూపాయల రుణాలను చెల్లించనుంది ప్రభుత్వం.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..