CBSE, JEE, NEET Update: కరోనా కారణంగా విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్ నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలోనే విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకొని కేంద్రం సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేసింది. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు మార్కులను ఇవ్వనున్నట్లు బోర్డు ఇప్పటికే ప్రకటించింది. ఇందుకోసం పాఠశాలల ప్రిన్సిపాల్‌ల అధ్యక్షతన ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే సీబీఎస్ఈ పరీక్ష ఫలితాలు, జేఈఈ, నీట్ పరీక్షల నిర్వహణపై విద్యార్థుల్లో ఇంకా పలు అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. దీంతో విద్యార్థుల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేసేందుకుగాను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోక్రియాల్ నిశాంక్ విద్యార్థులతో వర్చువల్‌గా మాట్లాడారు.
ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. `ఇంటర్నల్ మార్కులతో సంతృప్తి చెందని విద్యార్థులకు ఆగస్టులో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఇక ఇంటర్నల్ మార్కుల ఆధారంగా ఫలితాలను సిద్ధం చేయాలని పాఠశాలలను సీబీఎస్ఈ ఇప్పటికే కోరిందన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ అధ్యక్షతన ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలని, ఈ కమిటీ ఐటి బృందాల సహాయంతో ఫలితాలను సిద్ధం చేసి అప్‌లోడ్ చేస్తుందని మంత్రి తెలిపారు. సీబీఎస్ఈ పరీక్షా ఫలితాలను జూలై 31లోపు ప్రకటించనున్నారు. రాత పరీక్షకు హాజరు కావాలనుకునే వారు సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్ cbse.nic.in లో రిజిస్టార్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఇక జేఈఈ, నీట్ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారని విద్యార్థులు అడిగిన ప్రశ్నకు మాత్రం మంత్రి సమాధానం ఇవ్వలేదు. బహుశా పరిస్థితులు మరింత మెరుగయ్యాక పరీక్షలు నిర్వహించే అవకాశమున్నట్లు సమాచారం.
Also Read: SBI Recruitment 2021: స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియాలో ఉద్యోగాలు.. దరఖాస్తులకు చివరి తేది జూన్ 28
JNTU Exams: జులైలో బీటెక్, బీఫార్మసీ పరీక్షలు.. షెడ్యూల్ విడుదల చేసిన హైదరాబాద్ జేఎన్‌టీయూ..