What India Thinks Today: భారత్‌ను విశ్వ గురువుగా మార్చేందుకు నూతన విద్యా విధానం ఒక అడుగు.. కేంద్ర విద్యాశాఖ మంత్రి..

|

Jun 18, 2022 | 6:15 PM

What India Thinks Today: TV9 గ్లోబల్ సమ్మిట్ ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ 2వ రోజు కార్యక్రమంలో కేంద్రమంత్రి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ నూతన విద్యావిధానంపై మాట్లాడారు...

What India Thinks Today: భారత్‌ను విశ్వ గురువుగా మార్చేందుకు నూతన విద్యా విధానం ఒక అడుగు.. కేంద్ర విద్యాశాఖ మంత్రి..
Dharmendra Pradhan
Follow us on

What India Thinks Today: TV9 గ్లోబల్ సమ్మిట్ ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ 2వ రోజు కార్యక్రమంలో కేంద్రమంత్రి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ నూతన విద్యావిధానంపై మాట్లాడారు. 34 ఏళ్ల తర్వాత దేశంలో జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చామన్నారు. నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ 2020 సుదీర్ఘ చర్చల తర్వాత రూపొందించిందని, 21వ శతాబ్దంలో భారతదేశాన్ని విశ్వ గురువుగా మార్చే దిశగా ఇది తొలి అడుగు అని మంత్రి తెలిపారు.

జూలై 29తో నూతన విద్యా విధానానికి (NEP) రెండేళ్లు పూర్తవుతాయని తెలిపిన మంత్రి, గడిచిన రెండేళ్లలో పాఠశాల విద్య, సాంకేతిక విద్య, ఉపాధ్యాయ విద్య వంటి అనేక కోణాల్లో గుణాత్మక మార్పులు వచ్చాయని తెలిపారు. నూతన విద్యా విధానంలో సరైన దిశలోనే పయనిస్తోందని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అన్నారు. ఈ విద్యావిధానంలో ఏ భాష ప్రాధాన్యతను తగ్గించమని పేర్కొనలేదు. మాతృభాషలో బోధించాలనే ఈ విధానంలో పేర్కొన్నారు.

నూతన విద్యా విధానంలో ఎక్కడా హిందీ, ఇంగ్లిష్‌ ప్రస్తావన లేదు. NEP ఏ భాషను తగ్గించాలని పేర్కొనలేదని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. ఇది మాతృభాషలో బోధించడం గురించి చెప్పలేదన్నారు. ఇందులో ఎక్కడా హిందీ, ఇంగ్లీషు ప్రస్తావన లేదు. హిందీ, మరాఠీ, తెలుగు, తమిళం లేదా ఏదైనా ఇతర భాష గురించి ఆందోళన అవసరం లేదు. ఈ భాషలన్నీ జాతీయ భాషలు.. NEPలో ఈ భాషలకు నిబంధనలు విధించలేదన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..