CCL Recruitment: సెంట్రల్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే..

|

Apr 01, 2023 | 9:07 PM

సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఝూర్ఖండ్‌ రాష్ట్రం రాంచీలోని సంస్థలో పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సీసీఎల్‌.. ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ అభ్యర్థులకు స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు..

CCL Recruitment: సెంట్రల్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే..
Ccl Jobs
Follow us on

సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఝూర్ఖండ్‌ రాష్ట్రం రాంచీలోని సంస్థలో పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సీసీఎల్‌.. ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ అభ్యర్థులకు స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 330 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో మైనింగ్ సర్దార్ (77), ఎలక్ట్రీషియన్(నాన్ ఎగ్జిక్యూటివ్) టెక్నీషియన్ (126), డిప్యూటీ సర్వేయర్ (204), అసిస్టెంట్ ఫోర్‌మాన్ టీ & ఎస్‌ (ఎలక్ట్రికల్) (107) ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

* అభ్యర్థుల వయసు 19-04-2023 నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 30-03-2023న ప్రారంభం కాగా 19-04-2023తో ముగియనుంది.

* రాత పరీక్షను 05-05-2023 తేదీన నిర్వహించి, రిజల్ట్స్‌ను 29-05-2023 తేదీన విడుదల చేయనున్నారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..