Central Bank India Recruitment 2023: సెంట్రల్ బ్యాంకులో 192 స్పెషలిస్ట్ కేటగిరీ పోస్టులకు నోటిఫికేషన్‌.. ఎవరు అర్హులంటే..

|

Nov 15, 2023 | 9:28 PM

దేశ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియ శాఖల్లో వివిధ స్పెషలిస్ట్ కేటగిరీల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రిస్క్ మేనేజ్‌మెంట్/ ఏజీఎం, రిస్క్ మేనేజ్‌మెంట్/ సీఎం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎస్‌ఎం, ఫైనాన్షియల్ అనలిస్ట్/ ఎస్‌ఎం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ మేనేజర్, లా ఆఫీసర్, క్రెడిట్ ఆఫీసర్, ఫైనాన్షియల్ అనలిస్ట్ మేనేజర్, సీఏ ఫైనాన్స్ అండ్‌ అకౌంట్స్‌ జీఎస్‌టీ/ ఐఏ/ బ్యాలెన్స్ షీట్/ టాక్సేషన్..

Central Bank India Recruitment 2023: సెంట్రల్ బ్యాంకులో 192 స్పెషలిస్ట్ కేటగిరీ పోస్టులకు నోటిఫికేషన్‌.. ఎవరు అర్హులంటే..
Central Bank Of India
Follow us on

దేశ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియ శాఖల్లో వివిధ స్పెషలిస్ట్ కేటగిరీల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రిస్క్ మేనేజ్‌మెంట్/ ఏజీఎం, రిస్క్ మేనేజ్‌మెంట్/ సీఎం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎస్‌ఎం, ఫైనాన్షియల్ అనలిస్ట్/ ఎస్‌ఎం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ మేనేజర్, లా ఆఫీసర్, క్రెడిట్ ఆఫీసర్, ఫైనాన్షియల్ అనలిస్ట్ మేనేజర్, సీఏ ఫైనాన్స్ అండ్‌ అకౌంట్స్‌ జీఎస్‌టీ/ ఐఏ/ బ్యాలెన్స్ షీట్/ టాక్సేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఏఎం తదితర పోస్టులను ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేయనున్నారు. మొత్తం 192 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ నిర్వహిస్తోంది.

పోస్టును బట్టి సంబంధిత విభాగంలో సీఏ, ఐసీఏఐ, ఐసీడబ్ల్యూఏఐ, సీఎఫ్‌ఏ, ఏసీఎంఏ, డిగ్రీ, డిప్లొమా, పీజీ, పీజీ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొందిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అభ్యర్ధులకు సంబంధిత విభాగంలో పని అనుభవం కూడా ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద రూ.850, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్ధులు రూ.175 రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద చెల్లించాలి. రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీగా నంబర్‌ 19, 2023వ తేదీని నిర్ణయించారు.ఇంటర్వ్యూలు డిసెంబర్ 3, 4వ వారం, 2023 నిర్వహిస్తారు.

కేటగిరీ వారీగా ఖాళీల వివరాలు..

  • ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పోస్టుల సంఖ్య: 1
  • రిస్క్ మేనేజ్‌మెంట్/ ఏజీఎం పోస్టుల సంఖ్య: 1
  • రిస్క్ మేనేజ్‌మెంట్/ సీఎం పోస్టుల సంఖ్య: 1
  • ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎస్‌ఎం పోస్టుల సంఖ్య: 6
  • ఫైనాన్షియల్ అనలిస్ట్/ ఎస్‌ఎం పోస్టుల సంఖ్య: 5
  • ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ మేనేజర్ పోస్టుల సంఖ్య: 73
  • లా ఆఫీసర్ పోస్టుల సంఖ్య: 15
  • క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య: 50
  • ఫైనాన్షియల్ అనలిస్ట్ మేనేజర్ పోస్టుల సంఖ్య: 4
  • సీఏ ఫైనాన్స్ అండ్‌ అకౌంట్స్‌ జీఎస్‌టీ/ ఐఏ/ బ్యాలెన్స్ షీట్/ టాక్సేషన్ పోస్టుల సంఖ్య: 3
  • ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఏఎం పోస్టుల సంఖ్య: 15
  • సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుల సంఖ్య: 15
  • రిస్క్ మేనేజర్ పోస్టుల సంఖ్య: 2
  • లైబ్రేరియన్ పోస్టుల సంఖ్య: 1

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.