Central Bank Of India Jobs: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ముంబై కేంద్రంగా పనిచేసే ఈ బ్యాంకు తమ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్ విభాగంలో ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 115 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ఎకనమిస్ట్ (01), ఇన్‌కంట్యాక్స్ ఆఫీసర్ (01), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (01), డేటా సైంటిస్ట్ (01), క్రెడిట్ ఆఫీసర్లు (10), డేటా ఇంజనీర్లు (11), ఐటీ సెక్యూరిటీ అనలిస్ట్ (01), ఐటీ ఎస్‌ఓసీ అనలిస్ట్ (02), రిస్క్ మేనేజర్లు (05), టెక్నికల్ ఆఫీసర్లు(క్రెడిట్)– (05), ఫైనాన్షియల్ అనలిస్ట్–20, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (15), లా ఆఫీసర్లు (20), రిస్క్ మేనేజర్లు (10), సెక్యూరిటీ (12) ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ డిగ్రీ, ఎంబీఏ, మాస్టర్స్ డిగ్రీ, సీఏ/సీఎఫ్‌ఏ/ఏసీఎంఏ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
* అభ్యర్థుల వయసు పోస్టులను అనుసరించి 20–45 ఏళ్ల మధ్య ఉండాలి.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ఆన్‌లైన్ రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
* రాత పరీక్షలో భాగంగా మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. నెగిటివ్ మార్క్ ఉంటుంది. ప్రతి తప్పుడు సమాధానానికి 0.25 మార్కుల చొప్పున తొలగిస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ 23-11-2021 తేదీని ప్రారంభమవుతుండగా, 17-12-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Nitin Gadkari: EV విప్లవం దగ్గరలోనే ఉంది.. రెండేళ్లలో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గుతాయి..
John Abraham: అమితాబ్ షోలో కన్నీళ్లు పెట్టుకున్న యాక్షన్ హీరో.. ఎందుకంటే..
Funny Video: నాగినిగా మారిన అందాల బామ.. క్రేజీ వీడియోలో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.?