C-DAC Recruitment 2022: బీటెక్‌ నిరుద్యోగులకు బంపరాఫర్‌! రూ.1,23,100ల జీతంతో సీడ్యాక్‌లో ఉద్యోగాలు..

|

Jul 10, 2022 | 6:54 AM

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్పర్మేషన్‌ టెక్నీలజీ మంత్రిత్వశాఖకు చెందిన సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (CDAC).. అడ్మిన్‌ ఆఫీసర్‌, ఫైనాన్స్‌ ఆఫీసర్ తదితర (Admin Officer Posts) పోస్టుల భర్తీకి..

C-DAC Recruitment 2022: బీటెక్‌ నిరుద్యోగులకు బంపరాఫర్‌! రూ.1,23,100ల జీతంతో సీడ్యాక్‌లో ఉద్యోగాలు..
Cdac Jobs
Follow us on

CDAC Admin Officer Recruitment 2022: భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్పర్మేషన్‌ టెక్నీలజీ మంత్రిత్వశాఖకు చెందిన సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (CDAC).. అడ్మిన్‌ ఆఫీసర్‌, ఫైనాన్స్‌ ఆఫీసర్ తదితర (Admin Officer Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 12

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు:

అడ్మిన్‌ ఆఫీసర్‌ పోస్టులు: 1
ఫైనాన్స్‌ ఆఫీసర్‌ పోస్టులు: 3
హెచ్‌ఆర్‌/ లీగల్‌ ఆఫీసర్‌ పోస్టులు: 1
జాయింట్‌ డైరెక్టర్‌ (ఫైనాన్స్‌): 1
పర్చేజ్‌ ఆఫీసర్‌ పోస్టులు: 1
సీనియర్‌ అడ్మిన్‌ ఆఫీసర్‌ పోస్టులు: 1
సీనియర్‌ ఫైనాన్స్‌ ఆఫీసర్‌ పోస్టులు: 2
టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులు: 1

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.56100 నుంచి రూ.1,23,100ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ/బీటెక్‌/ఎంసీఏ/ఎంబీఏ/సీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తులకు చివరి తేదీలు: జులై 26, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.