సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఝార్ఖండ్‌లోని రాంచీలో ఉన్న ఈ సంస్థలో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 2022-23 సంవత్సరానికి గాను ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 139 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో జూనియర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ (ట్రైనీ) టీ & ఎస్ గ్రేడ్-ఇ పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత పొంది ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాత పరీక్ష, ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తులను జీఎం/ హెచ్‌వోడీ డిపార్ట్‌మెంట్, జనరల్ మేనేజర్ (పీ-ఎన్‌ఈఈ) కార్యాలయం, సీసీఎల్, రాంచీ అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణకు 06-12-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..