CBSE Term 1 Result: జనవరి 25న సీబీఎస్‌ఈ టర్మ్-1 ఫలితాలు విడుదలవ్వట్లేదు! అది ఫేక్ న్యూస్.. నమ్మకండి..

|

Jan 25, 2022 | 5:13 PM

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10, 12వ తరగతి బోర్డు పరీక్షల ఫలితాలను జనవరి 25న విడుదల చేయనున్నట్లు సర్క్యులర్ అవుతున్న వార్తలు నకిలీవని బోర్డు అధికార ప్రతినిధి రామశర్మ ఈరోజు ట్విటర్ ద్వారా తెలిపారు.

CBSE Term 1 Result: జనవరి 25న సీబీఎస్‌ఈ టర్మ్-1 ఫలితాలు విడుదలవ్వట్లేదు! అది ఫేక్ న్యూస్.. నమ్మకండి..
Cbse Term 1 Results
Follow us on

CBSE Class 10, 12 term 1 results schedule: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10, 12వ తరగతి బోర్డు పరీక్షల ఫలితాలను జనవరి 25న విడుదల చేయనున్నట్లు సర్క్యులర్ అవుతున్న వార్తలు నకిలీవని బోర్డు అధికార ప్రతినిధి రామశర్మ ఈరోజు ట్విటర్ ద్వారా తెలిపారు. జనవరి 22 నాటి నకిలీ సర్క్యులర్ ప్రకారం CBSE బోర్డు పరీక్ష ఫలితాలను చూసే ప్రక్రియను బోర్డు మార్చిందని, అభ్యర్థులకు వారి పరీక్ష కేంద్రాల ద్వారా ప్రత్యేక యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఇవ్వబడుతుందని, కొత్త వెబ్ పోర్టల్‌లో లాగిన్ అవ్వడం ద్వారా మాత్రమే ఫలితాలను తనిఖీ చేయగలరని పేర్కొంది. ఐతే ఇది ఫేక్ నోటిఫికేషన్ అని దానిని విడుదల చేసినవారిపై తగు చర్యలు తీసుకుంటామని, ఫలితాలను పొందే ప్రక్రియలో ఎలాంటి మార్పులు చేయలేదని తాజాగా CBSE ధృవీకరించింది.

CBSE 10, 12 తరగతులకు చెందిన టర్మ్ 1 ఫలితాలు విడుదల చేసినట్లయితే CBSE అధికారిక వెబ్‌సైట్ cbse.nic.in, cbse.gov.in, cbseresults.nic.in, Results.gov.in లతోపాటు, బోర్డు అధికారిక సోషల్ మీడియా పేజీలయిన DigiLocker యాప్, వెబ్‌సైట్ digilocker.gov.in లో కూడా ఫలితాలు అందుబాటులో ఉంటాయని ఈ రోజు అధికారికంగా ధృవీకరించింది. పరీక్షల ఫలితాలను పొందడానికి విద్యార్ధులు వారి రోల్ నంబర్‌లను నమోదు చేయవల్సి ఉంటుందని తెల్పింది. కాగా CBSE టర్మ్ 1 బోర్డు పరీక్షలను నవంబర్ – డిసెంబర్, 2021లో నిర్వహించింది. ఇక టర్మ్ 2 పరీక్షలను మార్చి-ఏప్రిల్, 2022లో నిర్వహించనుంది. వీటికి సంబంధించిన ఫలితాలు త్వరలో వెలువడనున్నాయి.

Also Read:

BSF Recruitment 2022: బీఎస్ఎఫ్‌లో 2,700 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అర్హతలు, వివరాలు..