CBSE Term 2 Result 2022 dates: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10,12వ తరగతి టర్మ్ 2 పరీక్షల ఫలితాల జులై మొదటి వారంలో విడుదలవనున్నాయి. సీబీఎస్సీ పదో తరగతి టర్మ్ 2 పరీక్షల ఫలితాలు జూలై 4 (సోమవారం), 12వ తరగతి ఫలితాలు జూలై 10న విడుదలయ్యే అవకాశం ఉందని విద్యా మంత్రిత్వ శాఖ అధికారిక వర్గాలు తెలిపాయి. ఐతే సీబీఎస్ఈ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. తాజా సమాచారం ప్రకారం 10వ తరగతి పరీక్షల మూల్యాంకన ప్రక్రియ దాదాపు పూర్తయినట్టు తెలుస్తోంది. టర్మ్ 1, 2 పరీక్షల్లో విద్యార్ధులు సాధించిన మొత్తం మార్కుల ఆధారంగా 12వ తరగతి ఫలితాలు ప్రకటించనున్నారు. ఈ ఏడాది 10, 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి జూన్ 15 వరకు జరిగాయి. సీబీఎస్సీ టర్మ్ 2 పరీక్షలకు దాదాపు 3,50,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాల ప్రకటన అనంతరం అధికారిక వెబ్‌సైట్ cbse.gov.in లేదా cbresults.nic.inలో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.