న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) జనవరి-2024 ఆన్సర్ కీని సీబీఎస్‌ఈ విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆన్సర్ కీపై అభ్యంతరాలను ఈ నెల 10వ తేదీలోగా తెలియజేయాలని బోర్డు తెలిపింది. కాగా దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జనవరి 21వ తేదీన సీటెట్ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది కీతోపాటు ఫలితాలను కూడా వెల్లడిస్తారు. కాగా సీటెట్పరీక్ష ఏటా రెండుసార్లు నిర్వహిస్తారు. ఈ పరీక్ష మొత్తం రెండు పేపర్‌లకు ఉంటుంది. పేపర్1 పరీక్ష ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునే వారికి కోసం నిర్వహిస్తుంది. ఇక రెండో పేపర్ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు. సీటెట్ స్కోర్ లైఫ్ లాంగ్వ్యాలిడిటీ ఉంటుంది. సీటెట్‌లో సాధించిన స్కోర్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారన్న సంగతి తెలిసిందే. సీటెట్ 2024 కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తెలంగాణలో ఈఏపీసెట్ 2024 షెడ్యూల్ తాజాగా విడుదలైంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి 21న విడుదలవుతుంది. 26వ తేదీ నుంచి ఏప్రిల్ 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 9 నుంచి 12 వరకు పరీక్షలు జరగనున్నాయి. కాగా ఇటీవల ఎంసెట్‌ను ఈఏపీసెట్‌గా మార్చిన విషయం తెలిసిందే.
తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ కొలువులకు ఎంపికైన 15,750 మంది అభ్యర్థులకు ఎట్టకేలకు భారీ ఊరట లభించింది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌కు సానుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో గతేడాది ప్రకటించిన ఫలితాలే ఖరారు కానున్నాయి. దీనిపై త్వరలో టీఎస్‌ఎల్‌పీఆర్బీ అధికారిక ప్రకటన చేయనుంది. నిపుణుల కమిటీ వేయాలన్న హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ టీఎస్‌ఎల్‌పీఆర్బీ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. బోర్డుకు సానుకూలంగా అత్యున్నత ధర్మాసనం స్పందించింది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.