AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CBSE Class 10th Result: నేడు సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్ష ఫలితాలు.. అధికారిక ప్రకటన..!

CBSE Class 10th Result: సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (CBSE) పదో తరగతి పరీక్ష ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఇప్పటికే ఫలితాలు విడుదలవుతున్నాయంటూ..

CBSE Class 10th Result: నేడు సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్ష ఫలితాలు.. అధికారిక ప్రకటన..!
CBSE Class 10th Result
Subhash Goud
|

Updated on: Aug 03, 2021 | 11:14 AM

Share

CBSE Class 10th Result: సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (CBSE) పదో తరగతి పరీక్ష ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఇప్పటికే ఫలితాలు విడుదలవుతున్నాయంటూ వార్తలు వెలువడుతుండటంతో సీబీఐఎస్‌ఈ బోర్డు అధికారికంగా ఫలితాలపై క్లారిటీ ఇచ్చేసింది. ఈ పదో తరగతి ఫలితాలు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల అవుతాయని వెల్లడించింది. ఈ ఫలితాల కోసం సీబీఎస్‌ఈ విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ cbseresults.nic.inలో ఫలితాలను చూసుకోవచ్చు. అలాగే విద్యార్థులు cbse.gov.in, cbse.nic.inలో కూడా ఫలితాలను చూసుకోవచ్చు. ఫలితాల మార్క్‌ షిట్‌లు, సర్టిఫికేట్‌లను యాక్సెస్‌ చేసుకోవచ్చు. మూల్యాంకన ప్రకారం.. ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌లు, అర్ధ సంవత్సరం లేదా మధ్యంతర పరీక్షలు, ప్రీ-బోర్డ్‌ పరీక్షలలో విద్యార్థుల పనితీరును బట్టి మార్కులు కేటాయించారు. అయితే వాస్తవానికి ఈ ఫలితాలు జులై 20న విడుదల చేయాల్సి ఉంది. అయితే.. స్కూళ్లు మార్కుల జాబితా పంపడంలో ఆలస్యం చేయడంతో ఫలితాల విడుదల కూడా వాయిదా పడింది.

కాగా, కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది కూడా సీబీఎస్‌ఈ 10,12 తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. గతవారం 12వ తరగతి ఫలితాలు విడుదల చేయగా, రికార్డు స్థాయిలో 99.37 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

ఇవీ కూడా చదవండి

CAT-2021 : క్యాట్ రిజిస్ట్రేషన్ ఈ తేదీ నుంచి ప్రారంభం.. నవంబర్‌లో పరీక్ష

AP Jobs: ఏపీ ఆరోగ్య శాఖలో భారీగా ఉద్యోగాలు.. నెలాఖరులోగా 3,390 నియామకాల కోసం చర్యలు..!

Follow Us
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!