CBSE Class 12 Exams: సీబీఎస్ 12 ప‌రీక్ష‌లు జ‌రుగుతాయా.? ర‌ద్దు చేస్తారా.? మ‌రికాసేపట్లో తేల‌నుంది..

|

May 17, 2021 | 8:33 AM

CBSE Class 12 Exams: క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా విద్య వ్య‌వ‌స్థ‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డింది. ఈ మాయ‌దారి రోగం ఏకంగా రెండు అకాడ‌మిక్ ఇయ‌ర్‌ల‌పై ప్ర‌భావం చూపింది. ఇప్ప‌టికే చాలా రాష్ట్రాలు...

CBSE Class 12 Exams: సీబీఎస్ 12 ప‌రీక్ష‌లు జ‌రుగుతాయా.? ర‌ద్దు చేస్తారా.? మ‌రికాసేపట్లో తేల‌నుంది..
Cbse 12th Class
Follow us on

CBSE Class 12 Exams: క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా విద్య వ్య‌వ‌స్థ‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డింది. ఈ మాయ‌దారి రోగం ఏకంగా రెండు అకాడ‌మిక్ ఇయ‌ర్‌ల‌పై ప్ర‌భావం చూపింది. ఇప్ప‌టికే చాలా రాష్ట్రాలు త‌మ ప‌రిధిలోని ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేశారు. ఇక మ‌రికొన్నింటినీ వాయిదా వేశారు. ఈ నేప‌థ్యంలో సీబీఎస్ఈ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణపై తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది. గ‌త కొన్ని రోజులుగా సీబీఎస్ఈ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తారా? లేదా వాయిదా వేస్తారా అన్న సందిగ్ధ‌త అందరిలోనూ నెల‌కొంది.
అయితే ఈ విష‌య‌మై మ‌రికాసేప‌ట్లో అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ విష‌య‌మై కేంద్ర విద్యా శాఖ సోమ‌వారం (నేడు) ఓ ప్ర‌క‌ట‌న చేయ‌నుంద‌ని స‌మాచారం. ఇందులో భాగంగానే కాసేప‌ట్లో స‌మావేశం కానున్నారు. ఇందులో భాగంగా కొవిడ్‌19 ప‌రిస్థితుల దృష్ట్యా ఓ నిర్ణ‌యం తీసుకోనున్నారు. ఇదిలా ఉంటే ఇప్ప‌టికే ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రుల నుంచి వాద‌న‌లు వినిపిస్తున్నాయి. అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితుల నేప‌థ్యంలో అధికారులు కూడా ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయ‌డానికే మొగ్గు చూప‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేస్తే యూనివ‌ర్సిటీ అడ్మిష‌న్ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌ని మ‌రికొంద‌రు వాధిస్తున్నారు. మ‌రి బోర్డు ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో మ‌రికాసేప‌ట్లో తేలిపోనుంది. ఇదిలా ఉంటే.. అంత‌కు ముందు షెడ్యూల్ ప్ర‌కారం సీబీఎస్ఈ ప‌రీక్ష‌ల‌ను మే 4 నుంచి నిర్వ‌హించాల్సి ఉంది. అయితే క‌రోనా కేసులు పెరుగిన నేప‌థ్యంలో త‌దుప‌రి ప్ర‌క‌ట‌న వ‌ర‌కు వాయిదా వేస్తూ నిర్ణ‌యం తీసుకుంది.

Also Read: గంగా నదిలో మృతదేహాలను పడేయకుండా చూడండి.. యూపీ, బీహార్‌ ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశం..

DRDO 2-DG Drug: కరోనాపై మరో అస్త్రం.. ఈ రోజే 2-డీజీ ఫ‌స్ట్ బ్యాచ్ రిలీజ్.. ఎక్కడంటే..?

Redmi Note 10: రెడ్‌మీ యూజ‌ర్ల‌కు గుడ్ న్యూస్‌.. నోట్ 10పై రూ. 2 వేలు త‌గ్గింపు.. ఫీచ‌ర్ల‌పై ఓ లుక్కేయండి..