CBSE Results: సీబీఎస్‌ఈ బోర్డ్ 12వ తరగతి టర్మ్ 1 పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. గతేడాది డిసెంబర్‌లో నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలను బోర్డ్ ఆఫ్‌లైన్ విధానంలో విడుదల చేసింది. పరీక్షకు హాజరైన విద్యార్థలు మార్కుల వివరాలను ఆయా పాఠశాలలకు నేరుగా ఈమెయిల్ ద్వారా పంపించారు.
విద్యార్థులు తమ స్కూల్‌లో సంప్రదించి మార్కుల వివరాలను తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆఫ్‌లైన్‌కే పరిమితం అయిన ఫలితాలను బోర్డ్ త్వరలో ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత వారంలో కూడా పదో తరగతి టర్మ్-1 ఫలితాలు విడుదల చేసినప్పుడు విద్యార్థుల మార్క్ షీట్‌లను బోర్డు అధికారులు సంబంధిత పాఠశాలలకు ఈ-మెయిల్ ద్వారా పంపిన విషయం తెలిసిందే. 12వ తరగతి టర్మ్ 1 ఫలితాలను ప్రకటించిన సీబీఎస్‌ఈ బోర్డ్.. 10, 12వ తరగతుల టర్మ్ 2 పరీక్షల నిర్వహణ విషయమై ప్రకటన జారీ చేసింది. టర్మ్ 2 పరీక్షలను ఏప్రిల్ 26 నుంచి ప్రారంభం కానున్నాయి.12వ తరగతి పరీక్షలు జూన్ 15న పూర్తి కానున్నాయి.
Yamini Bhaskar: యమ్మీ యమ్మీ స్టిల్స్ తో రభస బ్యూటీ.. యామిని భాస్కర్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్
Holi Crime: పండుగ పేరుతో పైశాచికం.. బ్లేడుతో గాట్లు.. రక్తం వస్తున్నా వదలకుండా