CBSE Admit Card 2024: సీబీఎస్‌ఈ పదో తరగతి, 12వ తరగతి పరీక్షల అడ్మిట్‌కార్డులు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే..

|

Feb 06, 2024 | 9:08 PM

సీబీఎస్‌ఈ 10వ, 12వ తరగతి పరీక్షలు ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పరీక్ష టైం టేబుల్‌ తేదీల వివరాలు కూడా వెల్లడయ్యాయి. ఈ పరీక్షలకు సంబంధించిన ఆన్‌లైన్‌ అడ్మిట్‌కార్డులు తాజాగా విడుదలయ్యాయి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలను నమోదు చేసి అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కాగా సీబీఎస్సీ పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు..

CBSE Admit Card 2024: సీబీఎస్‌ఈ పదో తరగతి, 12వ తరగతి పరీక్షల అడ్మిట్‌కార్డులు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే..
CBSE Admit Card 2024
Follow us on

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: సీబీఎస్‌ఈ 10వ, 12వ తరగతి పరీక్షలు ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పరీక్ష టైం టేబుల్‌ తేదీల వివరాలు కూడా వెల్లడయ్యాయి. ఈ పరీక్షలకు సంబంధించిన ఆన్‌లైన్‌ అడ్మిట్‌కార్డులు తాజాగా విడుదలయ్యాయి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలను నమోదు చేసి అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కాగా సీబీఎస్సీ పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు జరగున్నాయి. ఇక 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్‌ 2 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలు ఆయా తేదీల్లో ప్రతి రోజు ఉదయం 10.30 గంటలకు మొదలవుతాయని సీబీఎస్‌ఈ బోర్డు వెల్లడించింది.

తెలంగాణలో త్వరలో అంగన్‌వాడీ ఖాళీల భర్తీ!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆయా జిల్లాల్లో స్థానికంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టుల నియామకాలు చేపట్టాలని భావిస్తోంది. నియామక ప్రక్రియ కార్యాచరణ చకచకా సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ ప్రకటనలు జారీ చేయనున్నారు. ఈ పోస్టులకు కేవలం మహిళా అభ్యర్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. స్థానికంగా నివాసం ఉంటూ ఏడు, పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్హత మార్కులు, స్థానికత, ఇంటర్వ్యూ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

APPSC గ్రూపు-4 ప్రొవిజనల్‌ జాబితా విడుదల.. వెబ్‌సైట్‌లో ఎంపికైన అభ్యర్థుల వివరాలు

ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు-4 ఉద్యోగాల భర్తీ తుది అంకానికి చేరుకుంది. తాజాగా ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ప్రొవిజనల్‌ జాబితాను ఎపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచింది. ఈ పోస్టులకు సంబంధించిన ప్రొవిజనల్‌ సెలక్షన్‌ లిస్ట్‌ను అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆరు పోస్టుల భర్తీకి 2022లో ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.