Fake CBSE Exam Schedule: సోషల్ మీడియాలో నకిలీ సీబీఎస్‌ఈ 10,12వ తరగతి పరీక్ష షెడ్యూల్.. నమ్మవద్దంటున్న అధికారులు
Fake CBSE Exam Schedule: ఇటీవల నుంచి సోషల్ మీడియాలో ఓ నకిలీ సీబీఐఎస్‌ఈ 10,12వ పరీక్ష షెడ్యూల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని, ఇది నకిలీదని అధికారులు...
Fake CBSE Exam Schedule: ఇటీవల నుంచి సోషల్ మీడియాలో ఓ నకిలీ సీబీఐఎస్‌ఈ 10,12వ పరీక్ష షెడ్యూల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని, ఇది నకిలీదని అధికారులు తేల్చి చెప్పారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న షెడ్యూల్ గత సంవత్సరం కిందటిదని, ఈ నకిలీ షెడ్యూల్‌ను నమ్మవద్దని అధికారులు సూచించారు. అయితే బోర్డు షెడ్యూల్ ప్రకారం.. 10,12వ తరగతి పరీక్షలను మే 4న ప్రారంభం అవుతాయి. 12వ తరగతి విద్యార్థులకు జూన్ 14తో ముగుస్తుండగా, పదో తరగతి విద్యార్థులకు జూన్ 7తో ముగియనున్నాయి.
కాగా, గతంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) వార్షిక పరీక్షా తేదీల్లో మార్పులు చేసిన విషయం తెలిసిందే.10, 12 తరగతుల పరీక్షల తేదీల్లో పలు మార్పులు చేస్తూ తుది తేదీలను ప్రకటించింది. ఇందుకోసం నూతన డేట్ షీట్ ను బోర్డు విడుదల చేసింది. 12 వ తరగతి మాథ్స్ పరీక్ష గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జూన్ 1న నిర్వహించాల్సి ఉండగా, మే1వ తేదీకి మార్చారు. ఫిజిక్స్ పరీక్షను మే 13కు బదులుగా 8న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతికి సంబంధించి సైన్స్ పరీక్షను జూన్ 2కు బదులుగా మే 21న నిర్వహించనున్నారు. 10వ తరగతికి సంబంధించి పరీక్ష ప్రారంభమయ్యే, ముగిసే తేదీల్లో ఎలాంటి మార్పులు లేవని అధికారులు స్పష్టం చేశారు.
సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు మే 4న ప్రారంభమై, జూన్ 7న ముగియనున్నాయి. అయితే, 12 వ తరగతి పరీక్షలు మే 4న మొదలు కానున్నాయి. అయితే, పాత షెడ్యూల్ ప్రకారం జూన్ 11న ఈ పరీక్ష ముగియనుండగా జూన్ 14న పరీక్షలు ముగిసేలా నూతన షెడ్యూల్ ను రూపొందించారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ cbse.nic.in నుం సందర్శించాలని బోర్డు సూచించింది.
కాగా, సాధారణంగా, ప్రాక్టికల్ పరీక్షలు జనవరిలో నిర్వహిస్తారు. రాత పరీక్షలు ఫిబ్రవరిలో ప్రారంభమై మార్చిలో ముగుస్తాయి. అయితే, కోవిడ్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని పరీక్షలు ఈ సెషన్‌ను ఆలస్యంగా మొదలవుతున్నాయి. 2021 లో బోర్డు పరీక్షలు ఆన్‌లైన్‌లో కాకుండా లిఖిత రీతిలో నిర్వహిస్తామని సీబీఎస్‌ఈ ఈ నెల ప్రారంభంలో ప్రకటించింది. అయితే, కోవిడ్ వ్యాప్తిని నియంత్రించడానికి దేశవ్యాప్తంగా పాఠశాలలు మార్చిలో మూసివేశారు. అక్టోబర్ 15 నుండి కొన్ని రాష్ట్రాల్లో వీటిని పాక్షికంగా తిరిగి తెరిచారు.
ఇవీ చదవండి: Lockdown: నిరుపేద కుటుంబాలను భయపెట్టిస్తున్న లాక్‌డౌన్.. ఉన్న ఉపాధి కోల్పోతే పరిస్థితి ఏమిటి..?
Golden Residency: యూఏఈ ఆరు నెలల వీసాకు శ్రీకారం… ఈ వీసా పొందేందుకు ఎవరెవరు అర్హులంటే..!